- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బీజేపీ సీనియర్ నేత కన్నుమూత.. ప్రగాఢ సంతాపం వ్యక్తం చేసిన ప్రధాని నరేంద్ర మోడీ
కర్ణాటక బీజేపీ సీనియర్ నేత, మాజీ మంత్రి రామచంద్ర గౌడ మృతి చెందడంపై ప్రధాని మోడీ ప్రగాఢ సంతాపం తెలిపారు.

దిశ, వెబ్ డెస్క్: కర్ణాటక చెందిన భారతీయ జనతా పార్టీ (BJP) అత్యంత సీనియర్ నేత, మాజీ మంత్రి ఎస్. వి. రామచంద్ర గౌడ (88) మంగళవారం బెంగళూరులోని ఒక ప్రైవేటు ఆస్పత్రిలో కన్నుమూశారు. గత కొంతకాలంగా వయో సహజ అనారోగ్య సమస్యలతో చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి విషమించడంతో తుదిశ్వాస విడిచారు. జనసంఘ్ కాలం నుంచి బీజేపీ ఎదుగుదల కోసం అహర్నిశలు కృషి చేసిన ఆయన మృతి పట్ల ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ట్విట్టర్ (X) వేదికగా తీవ్ర విచారం వ్యక్తం చేస్తూ నివాళులర్పించారు.
గ్రాస్‌రూట్ స్థాయి నుండి పార్టీని నిర్మించిన నేత
ప్రధాని మోడీ తన సందేశంలో.. "సీనియర్ బీజేపీ నేత రామచంద్ర గౌడ జీ మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. కర్ణాటకలో మన పార్టీకి ఆయన ఒక బలమైన స్తంభం లాంటివారు. క్షేత్రస్థాయి (Grassroots) లో పార్టీని బలోపేతం చేయడానికి, కొన్ని తరాల కార్యకర్తలను తీర్చిదిద్దడానికి ఆయన తన జీవితంలో దశాబ్దాల కాలాన్ని అంకితం చేశారు. కార్పొరేటర్‌గా, ఎమ్మెల్సీగా, రాష్ట్ర మంత్రిగా ఆయన ప్రజా జీవితం అంతా అచంచలమైన నిబద్ధత, నిరంతర సేవలతో సాగింది. ఆయన కుటుంబ సభ్యులకు, మద్దతుదారులకు, అసంఖ్యాక అభిమానులకు నా హృదయపూర్వక సానుభూతిని తెలియజేస్తున్నాను. ఓం శాంతి" అని పేర్కొన్నారు. రామచంద్ర గౌడ కర్ణాటక శాసనమండలికి వరుసగా 5 సార్లు ఎన్నికవడంతో పాటు గత బీజేపీ ప్రభుత్వాలలో వైద్య విద్య, గనులు, భూగర్భ శాస్త్రం వంటి కీలక శాఖల మంత్రిగా సేవలందించారు.






