- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జేపల్లిలో విషాదం..అనారోగ్యంతో విద్యుత్ లైన్ మెన్ మృతి
జేపల్లి గ్రామానికి చెందిన విద్యుత్ లైన్ మెన్ మల్లేపాకుల శ్రీనివాసులు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు.

దిశ, చారకొండ : జేపల్లి గ్రామానికి చెందిన విద్యుత్ లైన్ మెన్ మల్లేపాకుల శ్రీనివాసులు అనారోగ్యంతో చికిత్స పొందుతూ మంగళవారం కన్నుమూశారు. ఆయనకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. 2006లో ఉద్యోగం పొందిన ఆయన రంగారెడ్డి జిల్లా, ఇర్విన్, వంగూర్, చారకొండ, రాచూరు ప్రాంతంలో 20సంవత్సరాల పాటు ఉత్తమ లైన్ మెన్ ఉద్యోగిగా సేవ లందిస్తూ గ్రామ ప్రజలు, రైతుల మన్ననలను పొందారు. ఆయన చివరిగా వెల్దండ మండల పరిధిలోని రాచూరు గ్రామంలో లైన్మెన్ విధులు నిర్వహిస్తూ ఉత్తమ సేవలందించారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన పరిస్థితి విషమించడంతో హైదరాబాద్ లోని కేర్ హాస్పిటల్ లో మంగళవారం ఉదయం 8.30 గంటలకు తుదిశ్వాస విడిచారు. శ్రీనివాసులు మృతి వార్తతో జేపల్లి గ్రా మంలో విషాదఛాయలు అలు ముకున్నాయి. కుటుంబ సభ్యులు, బంధువులు, సహచర ఉద్యోగులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు.
శ్రీనివాసులు ఆకస్మిక మరణం తీవ్రంగా గ్రామస్తుల సంతాపం..
విద్యుత్ శాఖలో తన కర్తవ్యాన్ని నిబద్ధతతో, నిజాయితీతో నిర్వర్తించిన లైన్ మెన్ శ్రీనివాసులు ఆకస్మిక మరణం మమ్మల్ని తీవ్రంగా కలచివేసిందని పలు వురు ఉద్యోగులు, రాజకీయ నాయకు లు, గ్రామ ప్రజలు, యువత, పలువురు ప్రముఖులు కన్నీటి పర్యంతమయ్యారు. ఆయన సేవాభావం, సహోద్యోగుల పట్ల చూపిన ఆప్యాయత, ప్రజల పట్ల ఉన్న అంకిత భావం ఎప్పటికీ మరువలేనిము అని, శ్రీనివాస్ మరణం విద్యుత్ శాఖకే తీరని లోటు, వారి పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుడిని ప్రార్థిస్తూ, వారి కుటుంబ సభ్యులకు ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని ప్రసాదించాలని పలువురు సంతాపం ప్రకటించారు.






