కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి: ఏఐసీటీయు నాయకులు

by Kodari Anjali |

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలని ఏఐసీటియు నాయకులు నిమ్మటూరి డిమాండ్ చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని నెరవేర్చాలి: ఏఐసీటీయు నాయకులు
X

దిశ, సత్తుపల్లి: తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్ యూనియన్ ఏఐటియుసి ఆధ్వర్యంలో ఎంఈఓ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం మండల విద్యాశాఖ అధికారి నక్క రాజేష్ రావుకి సమస్యలతో కూడిన వినతిపత్రం అందించారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ రాష్ట్ర సమితి సభ్యులు నిమ్మటూరి రామకృష్ణ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మధ్యాహ్న భోజన కార్మికులకు అరకొర మెన్ చార్జీల వల్ల విపరీతంగా నష్టపోవాల్సి వస్తుందని తెలంగాణ రాష్ట్ర మధ్యాహ్నం భోజన పథకం వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ప్రభుత్వమే నిత్యవసర సరుకులు, వంటగ్యాస్, కోడిగుడ్లను ప్రభుత్వమే సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులు..

అలాగే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం 2023లో ఏర్పడిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికలకు ముందు ఇచ్చిన పదివేల వేతనం హామీని తక్షణమే అమలు చేయాలని.. ఈ సందర్భంగా రామకృష్ణ ప్రభుత్వాన్ని కోరారు. మధ్యాహ్నం భోజన కార్మికులను కార్మికులుగా గుర్తించి గుర్తింపు కార్డులు అందజేయాలని ఈఎస్ఐ. పి ఎఫ్. ప్రమాద బీమా తదితర సౌకర్యాలు కల్పించాలని ప్రభుత్వాన్ని సందర్భంగా రామకృష్ణ కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ సత్తుపల్లి మండల ప్రధాన కార్యదర్శి తెలగారపు రామారావు తెలంగాణ మధ్యాహ్నం భోజనం పథకం వర్కర్స్ యూనియన్ ఖమ్మం జిల్లా ఉపాధ్యక్షురాలు షేక్ రహీమున్నీసా, సత్తుపల్లి మండల అధ్యక్షురాలు కుంట వెంకమ్మ, ప్రధాన కార్యదర్శి మహాదేవ లక్ష్మి, పూచి సీత, వసంత, శ్రీలక్ష్మి, మంగమ్మ, నరసమ్మ, రాజ్యలక్ష్మి, జీవ, కనకదుర్గ, కృష్ణవేణి, వెంకటరమణ, నసీమా తదితరులు పాల్గొన్నారు.

Next Story