- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
టీటీడీ (TTD) బోర్డు సంచలన నిర్ణయాలు.. సర్వదర్శనం భక్తులకు శాశ్వత షెల్టర్లు
సర్వదర్శనం భక్తులకు శాశ్వత షెల్టర్లు, 791 మంది వేద పండితుల నియామకం.. టీటీడీ బోర్డు సమావేశంలో కోట్లాది రూపాయల నిధుల మంజూరు!

దిశ, వెబ్ డెస్క్: తిరుమల తిరుపతి బోర్డు ఈ రోజు పలు సంచలన నిర్ణయాలు తీసుకుంది. ఈ రోజు జరిగిన (TTD) ధర్మకర్తల మండలి సమావేశంలో భక్తుల సౌకర్యార్థం, ఆలయాల రక్షణ కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. తిరుమలలో సర్వదర్శనం కోసం వేచి ఉండే సామాన్య భక్తులు ఎండకు, వానకు ఇబ్బంది పడకుండా ఉండేందుకు అత్యాధునిక వసతులతో కూడిన శాశ్వత షెల్టర్లను నిర్మించాలని బోర్డు నిర్ణయించింది. దీంతో పాటు ఆళ్వార్ ట్యాంక్ దగ్గర సౌకర్యాల కోసం రూ. 6.31 కోట్లు, కుమారధార-పసుపుధార డ్యామ్‌లకు డబుల్ లేన్ వంతెన నిర్మాణానికి రూ. 2.77 కోట్లు, ఒంటిమిట్టలో భక్తుల వసతి కొరకు 100 గదుల విశ్రాంతి భవన నిర్మాణానికి ఆమోదం తెలిపారు. అలాగే భక్తులు ఎంతగానో ఎదురుచూసే శ్రీవారి 2027 డైరీలు, క్యాలెండర్ల ముద్రణకు బోర్డు ముందస్తుగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
ఆధ్యాత్మిక రంగాన్ని మరింత ప్రోత్సహించే భాగంలో శ్రీవారి ఆలయం తో పాటు అనుబంధ ఆలయాలలో వేద పారాయణం కొరకు రికార్డు స్థాయిలో 791 మంది వేద పండితులను నియమించాలని టీటీడీ చారిత్రాత్మక నిర్ణయం తీసుకుంది. అలాగే శ్రీవారి భక్తి కార్యక్రమాల్లో పాల్గొనే కళాకారుల పారితోషికాల పెంపునకు ఆమోదం తెలిపింది. ఆలయాల భద్రతలో భాగంగా ప్రధాన ప్రాంగణాల్లో అత్యాధునిక అగ్నిమాపక వ్యవస్థల ఏర్పాటుకు రూ. 2.35 కోట్లు మంజూరు చేశారు. పర్యావరణ పరిరక్షణ కోసం తిరుమలలో 800 కిలోవాట్ల విండ్ టర్బైన్ ఏర్పాటుతో పాటు, పాత ఘన వ్యర్థాల శాస్త్రీయ శుద్ధి కొరకు రూ. 5 కోట్లు కేటాయిస్తూ బోర్డు కీలక నిర్ణయాలు తీసుకుంది.






