ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలి

by Batti.Sumithra |

అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ అన్నారు.

ప్రభుత్వ ఆసుపత్రుల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలి
X

దిశ, కమ్మర్ పల్లి‌ : అన్ని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో కాన్పులు జరిగేలా ప్రోత్సహించాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్ రాజశ్రీ అన్నారు. మంగళవారం మండలంలోని చౌట్ పల్లి, కమ్మర్ పల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలను ఆమె ఆకస్మికంగా తనిఖీ నిర్వహించారు. ఆసుపత్రిలో అందుతున్న వైద్యసేవలు, నిర్వహిస్తున్న రికార్డులు, వివిధ రిజిస్టర్లు, మందుల నిల్వలను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా చౌటుపల్లిలో జరుగుతున్న ఆరోగ్య మహిళా, అమ్మ ఒడి కార్యక్రమంలో భాగంగా గర్భిణీ స్త్రీలకు అందుతున్న సేవలను అడిగి తెలుసుకున్నారు. ప్రతి మహిళను మంగళవారం రోజు తప్పకుండా స్క్రీనింగ్ చేయాలని దానికి సంబంధించిన రక్త పరీక్షలు అన్ని రకాల పరీక్షలు నిర్వహించాలని వైద్యాధికారి డాక్టర్ అసీనను ఆదేశించారు.

గర్భిణీ స్త్రీలు ప్రభుత్వ కాన్పులు జరిగేలా చూడాలని ఆరోగ్య కార్యకర్తలను ఆదేశించారు. ప్రతి గర్భిణీ స్త్రీకి అన్ని రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలని తెలిపారు. వచ్చే వర్షాకాలంలో మలేరియా, డెంగ్యూ మొదలగు వ్యాధులు వచ్చే ప్రమాదం ఉందని ప్రతి ఒక్కరూ ప్రజలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. తద్వారా మలేరియా, డెంగ్యూ జ్వరాలను అరికట్టవచ్చని తెలిపారు. గ్రామంలోని గర్భిణీలు, బాలింతలు, చిన్నారులకు ప్రభుత్వం నిర్దేశించిన షెడ్యూల్ ప్రకారం వ్యాధి నిరోధక టీకాలు ఎలాంటి అంతరాయం లేకుండా అందించాలని సూచించారు. ప్రజలకు నాణ్యమైన, సకాలంలో వైద్య సేవలు అందించడం ప్రభుత్వ ఆసుపత్రుల ప్రధాన బాధ్యత అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్మూర్ ఏరియా సబ్ యూనిట్ అధికారి సాయి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.

Next Story