- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
రామ్ చరణ్-సుకుమార్ ‘RC-17’సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో స్టార్ హీరోయిన్?
ఈ సినిమాకు సంబంధించి ఒక సూపర్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోందని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి.

దిశ, సినిమా: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ ఇటీవల ‘పెద్ది’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో హిట్ అందుకోలేకపోయింది. ఈ క్రమంలో చరణ్ తన తదుపరి చిత్రాన్ని స్టార్ డైరెక్టర్ సుకుమార్ దర్శకత్వంలో చేయడానికి రెడీ అయ్యారు. వీరిద్దరి కాంబినేషన్‌లో రాబోతున్న ‘RC17’పై ఇండస్ట్రీలోనూ, ప్రేక్షకులలోనూ భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇప్పటికే వీరి కాంబోలో వచ్చిన ‘రంగస్థలం’ ఇండస్ట్రీ హిట్ సాధించడంతో, ఈ కొత్త ప్రాజెక్ట్ అధికారిక ప్రకటన వచ్చినప్పటి నుంచే అందరి దృష్టి దీనిపై పడింది. ఇదిలా ఉంటే, తాజాగా ఈ సినిమాకు సంబంధించి ఒక సూపర్ అప్‌డేట్ సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
ఈ సినిమాలో లేడీ సూపర్ స్టార్ నయనతార నటించబోందని సోషల్ మీడియాలో పలు పోస్టులు వైరల్ అవుతున్నాయి. అయితే ఆమె హీరోయిన్‌గా కాకుండా.. కథలో ఎంతో ప్రాధాన్యత ఉన్న ఒక ముఖ్యమైన పాత్రలో కనిపించబోతున్నట్లు టాక్. సుకుమార్ సినిమాల్లో పాత్రలు చాలా పవర్‌ఫుల్‌గా ఉంటాయి. కేవలం హీరో, హీరోయిన్లే కాకుండా మిగిలిన క్యారెక్టర్లను కూడా ఆయన ఎంతో అద్భుతంగా డిజైన్ చేస్తారు. అలాంటిది నయనతార లాంటి సీనియర్ స్టార్ నటి ఈ సినిమాలో నటిస్తే.. ఆ పాత్ర రేంజ్ ఎక్కడికో వెళ్ళిపోతుందని, సినిమాకు భారీ క్రేజ్ వస్తుందని ఫ్యాన్స్ నమ్ముతున్నారు. అయితే ఈ సినిమాలో నయనతార పాత్ర ఏంటి? ఆమె ఎలాంటి లుక్‌లో కనిపించబోతోంది? అని నెటిజన్లలో ఆసక్తి నెలకొంది. ఇందులో నిజమెంత అనేది తెలియనప్పటికీ ఇందుకు సంబంధించిన వార్తలు నెట్టింట హాట్ టాపిక్‌గా మారాయి.






