భక్తుల పుణ్యస్నానాలకు ఇబ్బందులు

by Ratna Kumari |

పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కురుమూర్తి స్వామి క్షేత్రంలో కొండ దిగువన ఉన్న కోనేరు నీరు లేక వెలవెలబోతోంది.

భక్తుల పుణ్యస్నానాలకు ఇబ్బందులు
X

దిశ, చిన్నచింతకుంట : పేదల తిరుపతిగా ప్రసిద్ధి చెందిన శ్రీ కురుమూర్తి స్వామి క్షేత్రంలో కొండ దిగువన ఉన్న కోనేరు నీరు లేక వెలవెలబోతోంది. పుణ్యస్నానాలు ఆచరించేందుకు వచ్చే భక్తులకు నీటి సౌకర్యం లేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మంగళవారం అమావాస్య సందర్భంగా జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు శ్రీ కురుమూర్తి స్వామి దర్శనానికి తరలివస్తారు. ఆలయ దర్శనానికి ముందు కోనేరులో పుణ్యస్నానం చేసి స్వామివారిని దర్శించుకోవడం భక్తుల ఆనవాయితీ. అయితే దేవస్థానం ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కోనేరులో ప్రస్తుతం నీరు లేకపోవడంతో భక్తులు నిరాశకు గురవుతున్నారు. పుణ్యస్నానాలు చేసేందుకు అనువైన ఏర్పాట్లు లేకపోవడంతో ఎక్కడికి వళ్లాలో తెలియక భక్తులు అవస్థలు పడుతున్నారు. అమావాస్య వంటి ప్రత్యేక పర్వదినాల్లో కూడా కోనేరును నీటితో నింపకపోవడంపై భక్తులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. దేవస్థాన అధికారులు కోనేరును శుభ్రపరచి వెంటనే నీటితో నింపడంతో పాటు భక్తులకు అవసరమైన కనీస సౌకర్యాలు కల్పించాలని భక్తులు విజ్ఞప్తి చేస్తున్నారు.

Next Story