- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
నమ్మించారు..కాజేశారు..!
పని మీద ఉన్నట్లు నమ్మించి అమాయక మహిళ దగ్గర నుంచి మూడు తులాల బంగారం అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది.

దిశ, నర్సంపేట: పని మీద ఉన్నట్లు నమ్మించి అమాయక మహిళ దగ్గర నుంచి మూడు తులాల బంగారం అపహరించిన సంఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. విశ్వసనీయ కథనం ప్రకారం... నర్సంపేట పట్టణంలోని నెక్కొండ రోడ్ వైపు గల కెనరా బ్యాంకు దగ్గర సోమవారం మధ్యాహ్నం ఈ ఘటన చోటు చేసుకుంది. పర్వతగిరి మండలం ముంజకుంట తండాకు చెందిన బానోతు నీల తన కుటుంబ అవసరాల కోసం మూడు తులాల బంగారు నగలను కొద్ది నెలల కిందట నెక్కొండ రోడ్డు వైపున గల కెనరా బ్యాంకులో తాకట్టు పెట్టారు. రుణం చెల్లించి నగలను తీసుకెళ్లేందుకు ఆమె భర్తతో కలిసి బ్యాంకుకు చేరుకుంది. బంగారం విడిపించుకుని కవర్ లో పెట్టుకుని బయటికి వచ్చారు. ఖర్చుల కోసమని ఆమె భర్త పక్కనే గల ఏ.టీ.ఏం లోకి వెళ్ళాడు. ఏ.టీ.ఏం ముందు నీల నిల్చుంది. గుర్తు తెలియని ముగ్గురు మహిళలు ఆమె చుట్టూ చేరి ఏదో పని మీద వచ్చినట్లు నమ్మించారు. పక్కనే నిలుచుని బాధితురాలు నీల పట్టుకున్న కవర్ సంచిని ఒక వైపు కత్తిరించి బంగారు నగలను కాజేశారు. అక్కడ నుండి ఉడాయించారు. ఏ.టీ.ఏం నుండి బయటికి వచ్చిన ఆమె భర్త కవర్ ను గమనించడంతో ఖంగు తిన్నారు. అనంతరం నర్సంపేట పోలీస్ స్టేషన్ ను ఆశ్రయించారు. సమాచారం అందుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. మహిళలను అంతరాష్ట్ర ముఠాగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం.






