- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహకం
వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలను సాగు చేసేందుకు ప్రభుత్వం వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తుంది.

దిశ, అక్బర్ పేట భూంపల్లి: వరి పంటకు ప్రత్యామ్నాయంగా ఉద్యానవన పంటలను సాగు చేసేందుకు ప్రభుత్వం వివిధ రకాల ప్రోత్సాహకాలను అందిస్తుంది. పంట మార్పిడి విధానం పాటించడం ద్వారా పంట భూముల్ని సారవంతంగా మార్చుకోవడంతో పాటు కలుపు మొక్కలను సాధ్యమైనంతగా నివారించవచ్చు. తక్కువ పెట్టుబడి తో అధిక దిగుబడులు సాధించవచ్చును. ఈ పంటల కోసం జిల్లా ఉద్యానవన శాఖ ఆధ్వర్యంలో రైతులకు పలు రాయితీలను అందిస్తుంది. 2026 -27 సంవత్సరానికి గాను రైతుల నుంచి దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది. ఆధునిక పద్ధతిలో ఉద్యానవన పంటల సాగు కోసం మల్చింగ్, స్టేకింగ్, డ్రిప్ వంటి పరికరాలకు సబ్సిడీలను ప్రకటించింది.
కూరగాయ పందిళ్లు..
కొత్తగా కూరగాయ పందిళ్లు వేయాలనుకునే రైతులకు అర ఎకరానికి రూ.50 వేల చొప్పన రాయితీని అందజేస్తుంది.
నారుపై సబ్సిడీ..
ఈ విధానంలో టమాటా, వంకాయ, మిర్చి, క్యాబేజీ, క్యాలీఫ్లవర్ వంటి పంటల నారు కోసం నీటి వృథాను అరికట్టేలా డ్రిప్ పరికరాల కోసం సబ్సిడీ అందిస్తోంది.
పండ్ల తోటలు..
మామిడి, జామ వంటి పలు పండ్ల తోటలను వేయాలనుకునే రైతులకు సబ్సిడీ అవకాశాలు కలవు.
స్టేకింగ్ విధానం..
స్టేకింగ్ విధానం ద్వారా కూరగాయలు సాగు చేసే రైతులకు 80 ఎకరాల వరకు సబ్సిడీ ఉంది.
మల్చింగ్ (కవర్) సాగు.. దుబ్బాక నియోజకవర్గం లోని అక్బర్ పేట భూంపల్లి, దుబ్బాక, మిరుదొడ్డి, తోగుట, రాయపోల్, దౌల్తాబాద్ మండలాలకు చెందిన రైతులకు ఈ విధానం ద్వారా 100 ఎకరాలకు సరిపడా మల్చింగ్ (కవర్) సబ్సిడీని అందుబాటులో ఉంచారు. ఈ విధానం ద్వారా నీటి ఆదా, కలుపు మొక్కల నివారణ సులభతరం అవుతుంది.
రైతులు సబ్సిడీ కోసం దరఖాస్తు చేసుకోవాలి... దుబ్బాక డివిజన్ ఉద్యాన శాఖ అధికారి డి. రమేష్
ఆసక్తి గల రైతులు
దరఖాస్తు ఫారం, పట్టాదారు పాస్ బుక్, ఆధార్ కార్డ్, బ్యాంక్ అకౌంట్ వివరాలు పాస్ ఫొటో తో తమను సంప్రదించాలని, పూర్తి వివరాలు కోసం 8977714436, 8185047092 నెంబర్లలో సంప్రదించాలన్నారు. నియోజకవర్గంలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు.






