- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సీఎం పర్యటన నేపథ్యంలో డ్రోన్లు, బెలూన్లకు నిషేధం
సీఎం రేవంత్ రెడ్డి పర్యటన నేపథ్యంలో కొత్తకోటను నో-ఫ్లయింగ్ జోన్‌గా ప్రకటించి డ్రోన్లు, బెలూన్ల వినియోగంపై నిషేధం విధించారు.

దిశ, క్రైం, వనపర్తి : రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి బుధవారం కొత్తకోట పర్యటన నేపథ్యంలో భద్రతా కారణాల దృష్ట్యా కొత్తకోట పట్టణాన్ని తాత్కాలికంగా నో-ఫ్లయింగ్ జోన్ గా ప్రకటించినట్లు జిల్లా ఎస్పీ సునీతారెడ్డి తెలిపారు. భద్రతా ఏర్పాట్లలో భాగంగా కొత్తకోట పట్టణ పరిధిలో డ్రోన్లు, కెమెరా డ్రోన్లు, బెలూన్లు, పారామోటార్లు, రిమోట్ కంట్రోల్‌తో ఎగిరే పరికరాలు, ఇతర మానవరహిత వైమానిక పరికరాలను సంబంధిత అధికారుల ముందస్తు అనుమతి లేకుండా వినియోగించడం పూర్తిగా నిషేధించినట్లు ఆమె వెల్లడించారు. ప్రజల భద్రతే లక్ష్యంగా ఈ ఆంక్షలను అమలు చేస్తున్నామని, నిబంధనలు ఉల్లంఘించి అనుమతి లేకుండా డ్రోన్లు లేదా ఇతర ఎగిరే పరికరాలను వినియోగించే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ప్రజలందరూ పోలీసు శాఖకు సహకరించి భద్రతా ఏర్పాట్లకు తోడ్పడాలని జిల్లా ఎస్పీ సునీతారెడ్డి విజ్ఞప్తి చేశారు.






