- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను వేగవంతం చేయాలి
ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈ నెల 24వ తేదీలోపు వంద శాతం పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పి. సౌమ్య పేర్కొన్నారు.

దిశ, తుర్కయంజాల్: ఎస్‌ఐఆర్-2026 ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియను ఈ నెల 24వ తేదీలోపు వంద శాతం పూర్తి చేయాలని రంగారెడ్డి జిల్లా ఎన్నికల అధికారి, చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పి. సౌమ్య పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఆదిభట్ల సర్కిల్-15కు ఇన్‌చార్జి అధికారిగా నియమితులైన చీఫ్ ప్లానింగ్ ఆఫీసర్ పి. సౌమ్య ఆదిభట్ల సర్కిల్ కార్యాలయంలో డిప్యూటీ కమిషనర్ (ఏఈఆర్‌ఓ) బి. సత్యనారాయణ రెడ్డితో కలిసి బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్వైజర్లు, స్పెషల్ ఆఫీసర్లతో మంగళవారం సమావేశం నిర్వహించారు. అనంతరం తుర్కయంజాల్, రాగన్నగూడ, ఇంజాపూర్ ప్రాంతాల్లోని బీఎల్‌ఓలను క్షేత్రస్థాయిలో సందర్శించి, వారి పనితీరును పరిశీలించారు. ఈ సందర్భంగా సిపిఓ సౌమ్య మాట్లాడుతూ ఎస్‌ఐఆర్-2026 ప్రక్రియను అధికారులు వేగవంతం చేయాలని అన్నారు. ప్రతి బీఎల్‌ఓ ఇంటింటికీ వెళ్లి ఎన్యూమరేషన్ ఫారాలను సేకరించి, వాటిని వెంటనే డిజిటలైజేషన్ చేయాలని సూచించారు. గడువులోగా 100 శాతం లక్ష్యాన్ని పూర్తి చేయడంలో నిర్లక్ష్యానికి తావులేకుండా పనిచేయాలన్నారు. ప్రతి పోలింగ్ స్టేషన్ పరిధికి ప్రత్యేక అధికారులను నియమించినట్లు తెలిపారు. ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ పురోగతిపై ఆరా తీస్తూ, ఎదురవుతున్న సమస్యలను తెలుసుకుని అధికారులకు అవసరమైన సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో ఏఎంసీలు శ్రీనివాసులు, బి. రమేష్, ఎస్‌డబ్ల్యూఎం డీఈఈ స్వర్ణ కుమార్, ఏఈ యోగేందర్ రెడ్డి, బీఎల్‌ఓలు, బీఎల్‌ఓ సూపర్వైజర్లు, ప్రత్యేక అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.






