- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సంగారెడ్డిలో జూలై 16న భారీ ఉద్యోగ మేళా
జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , సేర్ప్ (ఈ.జి.ఎం.ఎం) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డి.ఆర్.డి.ఓ తెలిపారు.

దిశ, సంగారెడ్డి అర్బన్: జిల్లాలోని నిరుద్యోగ యువతీ యువకులకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ , సేర్ప్ (ఈ.జి.ఎం.ఎం) ఆధ్వర్యంలో ఉద్యోగ మేళా నిర్వహించనున్నట్లు డి.ఆర్.డి.ఓ తెలిపారు. ఈ ఉద్యోగ మేళా జూలై 16, 2026 గురువారం ఉదయం 10.00 గంటలకు సంగారెడ్డిలోని పాత డి.ఆర్.డి.ఏ కార్యాలయం, బైపాస్ రోడ్ నందు జరుగుతుందని పేర్కొన్నారు. ఈ మేళాలో హానర్ లాబ్ లిమిటెడ్ అనే ప్రైవేటు కంపెనీ పాల్గొంటుందని, ఇంటర్వ్యూల ద్వారా అర్హులైన అభ్యర్థులను ఎంపిక చేస్తారని తెలిపారు. కంపెనీలో ఎగ్జిక్యూటివ్ పోస్టులకు మొత్తం 100 ఖాళీలు ఉన్నాయని వెల్లడించారు. ఈ పోస్టులకు బీఎస్సీ కెమిస్ట్రీ, బి.ఏ, బి.కామ్, ఎంఎస్సీ కెమిస్ట్రీ, బి.ఫార్మసీ ఉత్తీర్ణులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చని సూచించారు. అభ్యర్థుల వయోపరిమితి 21 సంవత్సరాల నుంచి 28 సంవత్సరాల వరకు ఉండాలని తెలిపారు. ఎంపికైన వారికి సంవత్సరానికి సి.టి.సి రూ. 2,76,960/- నుంచి రూ. 2,80,968/-వరకు జీతం అందుతుందని, విధులు బోంతపల్లి లో నిర్వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు.ఇంటర్వ్యూలకు హాజరయ్యే అభ్యర్థులు తమ విద్యార్హత సర్టిఫికెట్ల జిరాక్స్ కాపీలు, అనుభవ ధృవీకరణ పత్రాలు ఉంటే వాటితో పాటు ఆధార్ కార్డు జిరాక్స్, రేషన్ కార్డు జిరాక్స్ మరియు పాస్‌పోర్ట్ సైజు ఫోటోలను తీసుకురావాలని సూచించారు.ఈ సదవకాశాన్ని జిల్లాలోని అర్హులైన నిరుద్యోగ యువతీ యువకులందరూ ఉపయోగించుకోవాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ సేర్ప్, సంగారెడ్డి జిల్లా అధికారులు కోరారు.






