- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
క్షేత్రస్థాయి పర్యటనలతోనే వాస్తవాలు: సీఎం చంద్రబాబు
ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ప్రజలకు మరింత వేగవంతమైన, పారదర్శకమైన సేవలు అందించడమే లక్ష్యంగా అధికారులు పనిచేయాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశించారు. క్షేత్రస్థాయికి వెళ్లి పరిశీలిస్తేనే వాస్తవ పరిస్థితులు తెలుస్తాయని, అందుకోసమే మంత్రులు, కార్యదర్శులు, హెచ్‌వోడీల పర్యటనలకు ప్రత్యేక షెడ్యూల్ ఇచ్చామని స్పష్టం చేశారు. సచివాలయంలోని ఆర్టీజీఎస్ (RTGS) కేంద్రంగా వివిధ శాఖల అధిపతులు, కార్యదర్శులతో సీఎం ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు.
ఏళ్లనాటి సమస్యలకు పరిష్కారం..
‘60-70 ఏళ్లుగా పెండింగ్‌లో ఉన్న శెట్టిపల్లి భూసమస్యను పరిష్కరించాం. ఈ ప్రాపర్టీ అన్‌లాక్ ద్వారా ప్రభుత్వానికి 90 ఎకరాల భూమి వచ్చింది. వట్టిచెరుకూరులో ఎప్పుడో నిర్మించుకున్న ఇళ్లకు పట్టాలు పంపిణీ చేశాం. ఇలా సమస్యలను విభాగాల వారీగా విడదీసి పరిష్కరించాలి. ఈ ఏడాది రాష్ట్ర జీఎస్‌డీపీ (GSDP) 20.4 శాతంగా నమోదైంది. లక్ష్యాలకు అనుగుణంగా ముందుకెళ్తే 15 శాతం వృద్ధిరేటు సాధించడం సులభమే. స్థిరమైన ఆర్థిక వ్యవస్థకు రాబడులు చాలా కీలకం. అయితే, కీలక విభాగాల్లో కొందరు ప్రతికూల పాత్ర పోషిస్తే ఇబ్బందులు తప్పవు. త్వరలోనే కేపీఐ (KPI) సూచీల ద్వారా నెలవారీ ఆర్థిక నివేదికలు సిద్ధం చేస్తాం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సాంకేతికతతో మెరుగైన పాలన..
దేవాదాయ, రోడ్లు-భవనాలు, ఏపీఎస్ఆర్టీసీ, రవాణా, అగ్నిమాపక శాఖల పనితీరుతో పాటు, రాష్ట్రంలో యూరియా నిల్వలపై సీఎం ఆరా తీశారు. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, సాంకేతికతను ఉపయోగించుకుని పాలనను మరింత పారదర్శకంగా, సమర్థవంతంగా తీర్చిదిద్దాలని అధికారులకు సీఎం దిశానిర్దేశం చేశారు.






