రక్తం పాకెట్లతో రాజకీయం అవసరం లేదు.. కాళేశ్వరంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు

by Prasad Jukanti |   (  Updated:2026-07-14 11:11:18  IST  )

ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పెంచాలని ఎన్నికల సంఘాన్ని కాంగ్రెస్ బృందం కోరింది.

రక్తం పాకెట్లతో రాజకీయం అవసరం లేదు..  కాళేశ్వరంపై మంత్రి పొన్నం కీలక వ్యాఖ్యలు
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణలో ఎస్ఐఆర్ ప్రక్రియ గడువు పొడిగించాలని తెలంగాణ కాంగ్రెస్ తెలంగాణ ఎన్నికల సంఘాన్ని కోరింది. ఈ మేరకు ఇవాళ మంత్రి పొన్నం ప్రభాకర్ ఆధ్వర్యంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి సుదర్శన్ రెడ్డిని కలిసిన కాంగ్రెస్ బృందం వినతి పత్రం సమర్పించింది. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడిన మంత్రి.. ఎస్ఐఆర్ ప్రక్రియ నత్తనడకన సాగుతోందని హైదరాబాద్ లో 15 శాతం కూడా పూర్తి కాలేదని అన్నారు. బీఎల్ఓలు సరిగా పని చేయడం లేదని అధికార యంత్రాంగాన్ని ఉపయోగించుకోవాలని కోరినట్లు చెప్పారు.

రక్తం పాకెట్లతో రాజకీయం అవసరం లేదు:

అనంతరం మీడియోతో ప్రత్యేకంగా మాట్లాడిన మంత్రి.. అనేక మంది శాస్త్రవేత్తలు ఎల్ నినో ప్రభావంతో వాతావరణ శాఖ వర్షాభావ పరిస్థితులు ఇబ్బందులు ఉంటాయని చెబుతున్నారని మంత్రి అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం రాకముందే కాళేశ్వరం కుంగిపోయిందని రక్తం పాకెట్లతో రాజకీయం చేయాల్సిన అవసరం లేదన్నారు. కాళేశ్వరం కూలడానికి కారణం బీఆర్ఎస్ అని, ఊరూరూ తిరిగి ఆ పార్టీ కుట్రలు ప్రజలకు తెలియజేస్తామన్నారు. ఎన్డీఎస్ఏ తుది నివేదిక ప్రకారం నీళ్లు నింపమని చెప్తే మేం వెంటనే నింపుతామన్నారు. మేము ఇంజనీర్లం కాదు.. ఇంజనీర్లు ఇచ్చిన సలహాలు పాటిస్తామన్నారు. ప్రాజెక్ట్ ఉపయోగంలోకి రావాలంటే ఏమి చేయాలో నిపుణులు చెబితే వెంటనే అమలు చేస్తామని చెప్పారు.

ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు?:

గత రెండు సంవత్సరాలుగా బీఆర్ఎస్ పార్టీ మౌనంగా ఉండి ఇప్పుడు కరువును దృష్టిలో పెట్టుకొని ప్రజలను రెచ్చగొడుతోందని విమర్శించారు. కావాలని మేడిగడ్డ ,కన్నెపల్లిపై రాజకీయం చేస్తున్నారని సాంకేతిక నిపుణులతో నేషనల్ డామ్ సేఫ్టీ అధికారులు ఇచ్చిన రిపోర్ట్ ప్రకారం తెలంగాణ ప్రభుత్వం చర్యలు చేపడుతుందన్నారు. ప్రకృతి వైపరీత్యాన్ని ఎదుర్కోవడానికి తెలంగాణ ప్రభుత్వం సిద్ధంగా ఉందని చెప్పారు. ఎల్ నినో ఎదుర్కోవడానికి ప్రభుత్వం తరుపున సూచనలు చేస్తున్నామని కరువును దృష్టిలో పెట్టుకొని రైతులు ప్రత్యామ్నాయ పంటలు వేసుకోవాలన్నారు. శంకర పరివారంలో ఆవు, పాము, నెమలి ఉంటాయి. అన్ని వ్యక్తిగతంగా వైరుధ్యం ఉన్న అక్కడ కలిసి ఉంటాయి ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాల కోసం కేంద్రంతో కోట్లడాలని రాజకీయ పార్టీలుగా అంతర్గతంగా ఎన్ని సమస్యలు ఉన్నా కలిసి ఎదుర్కోవాలన్నారు.బండి సంజయ్ ఎన్టీఎస్ఏను తుది నివేదిక ఇవ్వమని చెప్పాలన్నారు. వారు చెప్పి విధంగా నీళ్ళు నింపుతామన్నారు. నింపిన తరువాత ఏదైనా ప్రమాదం జరిగితే ఎవరు బాధ్యులు? అని ప్రశ్నించారు. గత రెండు సంవత్సరాలు గేట్లు వేయనప్పుడు ఎవరు మాట్లాడలేదని కేటీఆర్, హరీశ్ రావు ప్రభుత్వానికి సూచనలు చేయవచ్చు. కానీ లేనిది ఉన్నట్టు బట్ట కాల్చి మీద వేయవద్దన్నారు. బాధ్యతగా ప్రతిపక్షం సలహాలు సూచనలు ఇవ్వాలన్నారు.

Next Story