- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
19 ఏళ్ల తర్వాత కోల్‌కతాకు తస్లీమా నస్రీన్
19 ఏళ్ల ప్రవాసం తర్వాత వచ్చే నెల కోల్‌కతాకు రానున్న బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్.. మత ఛాందసవాద వ్యతిరేక సదస్సుకు హాజరు!

దిశ, వెబ్ డెస్క్: వివాదాస్పద రచనల కారణంగా దాదాపు రెండు దశాబ్దాల క్రితం బంగ్లాదేశ్ రచయిత్రి తస్లీమా నస్రీన్ (Taslima Nasrin) కోల్‌కతాను విడిచిపెట్టి వెళ్లిపోయింది. అయితే తాజాగా అదే నగరంలో ఆమె మళ్లీ అడుగు పెట్టబోతున్నారు. వచ్చే నెల (ఆగస్టు 2026) లో కోల్‌కతాలో నిర్వహించనున్న ఒక ప్రత్యేక మత ఛాందసవాద వ్యతిరేక (Anti-fundamentalism) సదస్సులో పాల్గొనేందుకు ఆమె రానున్నారు. పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో ఇదొక అత్యంత ప్రాధాన్యత కలిగిన, రాజకీయ ప్రతీకాత్మకమైన (Politically Symbolic) ఘట్టంగా మారబోతోంది.
నిరసనల కాలం నుండి రాజకీయ మలుపు వరకు..
2007లో ఆమె రాసిన 'ద్విఖందితో' (Dwikhandito) పుస్తకానికి వ్యతిరేకంగా ముస్లిం మత పెద్దలు, ఛాందసవాదులు కోల్‌కతాలో భారీ ఎత్తున హింసాత్మక ఆందోళనలు చేపట్టడంతో అప్పటి ప్రభుత్వం భద్రతా కారణాల దృష్ట్యా ఆమెను నగరం దాటించింది. ఆ తర్వాత ఆమె సుదీర్ఘ కాలంగా ఢిల్లీ, ఐరోపా దేశాలలో ప్రవాస జీవితాన్ని గడుపుతున్నారు. అయితే, పశ్చిమ బెంగాల్‌లో ప్రస్తుత బీజేపీ ప్రభుత్వం ఈ పరిణామాన్ని ఒక రాజకీయ విజయంగా ప్రొజెక్ట్ చేస్తోంది. గతంలో ఓటు బ్యాంకు రాజకీయాల కోసం మత ఛాందసవాదులకు లొంగిపోయి చేసిన తప్పును తాము సరిదిద్దుతున్నామని, భావ ప్రకటన స్వేచ్ఛను పునరుద్ధరిస్తున్నామని అధికార బీజేపీ శ్రేణులు పేర్కొంటున్నాయి. దాదాపు 19 ఏళ్ల తర్వాత ఆమె తిరిగా రానుండటంతో కోల్‌కతాలో భద్రతను కట్టుదిట్టం చేయనున్నారు.






