- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సర్కార్ బడులకు పెద్దపీట
ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధే ప్రభుత్వ లక్ష్యమని గోగుల సరిత పేర్కొంటూ మేడిపల్లి పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు.

దిశ, మేడిపల్లి : ప్రభుత్వ పాఠశాలల బలోపేతం, విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడమే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రభుత్వ లక్ష్యమని తెలంగాణ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు గోగుల సరిత అన్నారు. మేడిపల్లి ప్రభుత్వ ఉన్నత పాఠశాలను కాంగ్రెస్ డివిజన్ అధ్యక్షుడు తుంగతుర్తి రవితో కలిసి ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో ముఖాముఖి నిర్వహించి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసి భోజన నాణ్యత, పరిశుభ్రత, పాఠశాల వసతులను పరిశీలించారు.
పాఠశాలలో సిబ్బంది కొరతతో పాటు విద్యార్థులు, ఉపాధ్యాయులు ప్రస్తావించిన సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని గోగుల సరిత హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా తుంగతుర్తి రవి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులకు మెరుగైన విద్యా సౌకర్యాలు కల్పించేందుకు తనవంతు సహకారం అందిస్తానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బలరాం, మహ్మద్ మజర్, ప్రణయ్, బర్రె నాగరాజు, సోమయ్య, కాటపాక కుమార్, సునిల్, జయందర్, శరత్ గౌడ్, సాయిరాం గౌడ్, భరత్, ఎంఈఓ శ్రీనివాస్, ప్రధానోపాధ్యాయులు సత్య ప్రసాద్, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.






