- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలి: టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పణ
విద్యాసంస్థల్లో ఫీజు రాయితీ కల్పించాలని టీయుడబ్ల్యూజే ఆధ్వర్యంలో వినతిపత్రం సమర్పించారు.

దిశ, భద్రాచలం: ప్రజాస్వామ్య వ్యవస్థలో మీడియా కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ, అనేక మంది వర్కింగ్ జర్నలిస్టులు పరిమిత ఆదాయంతో కుటుంబాలను పోషిస్తూ పిల్లల చదువులకు అయ్యే ఖర్చులను భరించడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, టీయుడబ్ల్యూజే (ఐజేయు) పట్టణ అధ్యక్షులు విజ్జగిరి రాజా కిరణ్, భద్రాచలం డివిజన్ ప్రింట్&ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్షులు భూక్యా రంజిత్,ఎల్. శ్రీహరి కుమార్ అన్నారు. జిల్లా కమిటీ సూచనల మేరకు పట్టణంలోని అక్రిడేషన్ కార్డు కలిగిన జర్నలిస్టుల పిల్లలకు పాఠశాల ఫీజులో 50 % రాయితీ కల్పించాలని కోరుతూ టీయుడబ్ల్యూజే (ఐజేయు) భద్రాచలం డివిజన్ కమిటీ, పట్టణ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం మండల విద్యాశాఖ అధికారి టి. రమాదేవిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆమె సానుకూలంగా స్పందించారు. ఫీజు రాయితీ అంశంపై జిల్లా విద్యాశాఖ ఉన్నతాధికారులతో చర్చించి జర్నలిస్టుల పిల్లలకు 50 % రాయితీ కల్పించే విధంగా కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎలక్ట్రానిక్ మీడియా డివిజన్ కార్యదర్శి జె. జయరాం, ప్రింట్ మీడియా ఉపాధ్యక్షులు కాటా సత్యం, సహాయ కార్యదర్శి బాబు, జిల్లా కార్యవర్గ సభ్యులు మదార్, పట్టణ ఆర్గనైజింగ్ సెక్రటరీ వి. ప్రేమ్ కుమార్, కోశాధికారి బి. నాయుడు, ఆర్. వెంకట్ , పి.నాగేంద్రబాబు, యం.సాయి కుమార్ తదితరులు పాల్గొన్నారు.






