- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
జోనల్ కమిషనర్ వికాస్ మహతోకు బీఆర్ఎస్ నాయకుల వినతి
ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరికి దరఖాస్తు ఫారాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు అధికారులను కోరారు.

దిశ, హస్తినాపురం: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణ (ఎస్ ఐ ఆర్ ) కార్యక్రమంలో భాగంగా అర్హులైన ప్రతి ఓటరికి దరఖాస్తు ఫారాలు సకాలంలో అందేలా చర్యలు చేపట్టాలని బీఆర్ఎస్ నాయకులు అధికారులను కోరారు. నందనవనం బాంబే కాలనీలోని ఆదర్శనగర్ కమ్యూనిటీ హాల్‌లో మంగళవారం నిర్వహించిన ఎస్ఐఆర్ దరఖాస్తు ఫారాల పంపిణీ, నింపిన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని మల్కాజ్గిరి మున్సిపల్ కార్పొరేషన్ జోనల్ కమిషనర్ వికాస్ మహతో పరిశీలించారు. ఈ సందర్భంగా జోనల్ కమిషనర్‌ను కలిసి హస్తినాపురం డివిజన్‌కు చెందిన బీఆర్ఎస్ నాయకులు ఎస్ ఐ ఆర్ ప్రక్రియలో ఎదురవుతున్న సమస్యలను వివరించారు. అర్హులైన ఓటర్లకు ఫారాలు ఆలస్యం కాకుండా అందేలా చర్యలు తీసుకోవడంతో పాటు, ఎలాంటి సాంకేతిక లేదా పరిపాలనా కారణాల వల్ల కూడా ఒక్క ఓటరు తన ఓటు హక్కును కోల్పోకుండా ప్రత్యేక శ్రద్ధ వహించాలని కోరారు. ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి అర్హుడైన ఓటరు ఎస్ఐఆర్ దరఖాస్తును సక్రమంగా నింపి నిర్ణీత గడువులోగా సంబంధిత బూత్ లెవల్ అధికారి (బిఎల్ఓ )కి సమర్పించాలని నాయకులు ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రజల్లో అవగాహన పెంచి, ప్రతి ఓటరికి అవసరమైన సహాయం అందించేందుకు అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎల్బీనగర్ సర్కిల్ - 13 ఏఎంసీ ఖాదీర్, ఎంఎంసి సిబ్బంది హస్తినాపురం డివిజన్ సీనియర్ బీఆర్ఎస్ నాయకుడు సంగిపేట్ నరేష్ కుమార్, బీసీ సెల్ అధ్యక్షుడు దేవర్ల విష్ణువర్ధన్ గౌడ్, పార్టీ కార్యకర్తలు, వివిధ కాలనీలకు చెందిన ప్రజలు పాల్గొన్నారు.






