- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ముంబై నుంచి చెన్నైకి షిఫ్ట్.. ‘పెద్ది’తో శృతి హాసన్‌కి కలిసి వచ్చిందా?
హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సింగర్‌గా అండ్ స్పెషల్ సాంగ్స్‌తో దుమ్ములేపుతుంది హీరోయిన్ శృతి హాసన్.

దిశ, సినిమా: హీరోయిన్‌గా, క్యారెక్టర్ ఆర్టిస్టుగా, సింగర్‌గా అండ్ స్పెషల్ సాంగ్స్‌తో దుమ్ములేపుతుంది హీరోయిన్ శృతి హాసన్. ఇటీవల రామ్ చరణ్ ‘పెద్ది’ సినిమాలో శృతి చేసిన స్పెషల్ సాంగ్ ‘హలెల్లెల్లో’ భారీగా హైలైట్ అయింది. అయితే ఈ క్రేజ్ శృతి హాసన్‌కు హీరోయిన్‌గా కొత్త అవకాశాలు తెస్తుందా? లేక ఐటెం సాంగ్స్‌కే పరిమితం చేస్తుందా అనే చర్చ ప్రజెంట్ ఇండస్ట్రీలో నడుస్తోంది. కెరీర్‌లో ఎప్పుడూ ప్రయోగాలకు సిద్ధంగా ఉండే శృతి.. ముందు ముందు ఎలాంటి పాత్రలను ఎంచుకుంటుందో అనేది ఆసక్తి కూడా ప్రేక్షకుల్లో కలుగుతోంది. ఇలాంటి సమయంలో కొన్నేళ్లుగా ముంబైలో తనకంటూ ప్రత్యేకమైన లైఫ్‌ను క్రియేట్ చేసుకున్న శ్రుతి హాసన్.. తాజాగా చెన్నైలో కొత్త ఇంట్లోకి అడుగుపెట్టడం ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది. సినిమా అవకాశాలు తగ్గుతున్న సమయంలో తన సంగీతం, వ్యక్తిగత జీవితంపై ఎక్కువ ఫోకస్ పెట్టేందుకే చెన్నైకి తిరిగి వచ్చారనే చర్చ జరుగుతోంది. మరి ఈ కొత్త ఇంటి ప్రయాణం.. శృతి కెరీర్‌లో కొత్త అధ్యాయానికి దారి తీస్తుందో లేదో వేచి చూడాల్సి ఉంది.






