కలెక్షన్లు రాకుంటే హీరోయిన్లను విమర్శించడం కరెక్ట్ కాదు.. భాగ్యశ్రీ బోర్సే సెన్సేషనల్ కామెంట్స్

by Mallepaka Hamsa |   (  Updated:2026-07-14 10:33:28  IST  )

తన పాత్రకు తాను వంద శాతం న్యాయం చేయడమే తనకు అసలైన సక్సెస్ అని భాగ్యశ్రీ స్పష్టం చేశారు. కానీ, బయటి ప్రపంచానికి కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే సక్సెస్‌లా కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

కలెక్షన్లు రాకుంటే హీరోయిన్లను విమర్శించడం కరెక్ట్ కాదు.. భాగ్యశ్రీ బోర్సే సెన్సేషనల్ కామెంట్స్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ బ్యూటీ భాగ్యశ్రీ బోర్సే నటించిన మిస్టర్ బచ్చన్, కాంత, కింగ్‌డమ్, ఆంధ్రకింగ్ తాలూకా వంటి సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఆశించిన స్థాయిలో మెప్పించలేకపోయాయి. దీంతో సోషల్ మీడియాలో కొందరు ఆమెను ఐరన్ లెగ్ అంటూ దారుణంగా ట్రోల్ చేశారు. అయితే, ఇలాంటి కష్టసమయంలో అక్కినేని అఖిల్ సరసన నటించిన ‘లెనిన్’ సినిమా భాగ్యశ్రీకి ఒక పెద్ద ఊరటనిచ్చింది. ఈ చిత్రం ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకోవడమే కాకుండా, బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లతో దూసుకుపోతూ సూపర్ హిట్‌గా నిలిచింది. ఈనేపథ్యంలో.. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న భాగ్యశ్రీ బోర్సే.. తనపై జరిగిన ట్రోలింగ్‌పై, సినిమాల పరాజయాలపై ఎంతో ఓపెన్‌గా మాట్లాడారు. ఒక నటిగా తన పాత్రకు తాను వంద శాతం న్యాయం చేయడమే తనకు అసలైన సక్సెస్ అని భాగ్యశ్రీ స్పష్టం చేశారు. కానీ, బయటి ప్రపంచానికి కేవలం బాక్సాఫీస్ కలెక్షన్లు మాత్రమే సక్సెస్‌లా కనిపిస్తాయని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకవేళ ఎవరైనా తన నటన బాలేదని లేదా ఒక సీన్ సరిగ్గా చేయలేదని విమర్శిస్తే.. నటిగా తాను ఫెయిల్ అయినట్లు ఒప్పుకుంటానని చెప్పారు. కానీ, సినిమా వసూళ్లు సరిగ్గా రాలేదనే కారణంతో, అది హీరోయిన్ ఫెయిల్యూర్ అనడం ఎంతమాత్రం కరెక్ట్ కాదని ఆమె హితవు పలికారు.సినిమా ప్లాప్ అయితే కేవలం హీరోయిన్లనే బ్లేమ్ చేసే ధోరణిని ఆమె తప్పుపట్టారు. వరుసగా రెండు మూడు ఫ్లాపులు రాగానే ఐరన్ లెగ్ అని, అన్‌లక్కీ అని నిందిస్తారని, తాను కూడా గతంలో అలాంటి మాటలు చాలా విన్నానని గుర్తుచేసుకున్నారు. కానీ సినిమాలో ఫైనల్ నిర్ణయం తమది కాదని, కథ చివరకు స్క్రీన్ మీద ఎలా మారుతుందనే క్లారిటీ కూడా హీరోయిన్లకు ఉండదని, ఇవన్నీ ప్రేక్షకులు కూడా అర్థం చేసుకోవాలని కోరారు. ఒకవేళ ఎడిటింగ్ రూమ్‌లో డైరెక్టర్, ప్రొడ్యూసర్, హీరోలతో పాటు తాను కూడా కూర్చుని సినిమా నిర్ణయాలు తీసుకుంటే.. అప్పుడు వచ్చే విమర్శలను తాను బాధ్యతగా స్వీకరిస్తానని భాగ్యశ్రీ చెప్పుకొచ్చారు.

సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రాధిక శరత్ కుమార్

Next Story