- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సెలబ్రిటీల పిల్లలను టార్గెట్ చేయడం పిరికిపంద చర్య.. ట్రోలర్స్‌కు ఇచ్చిపడేసిన రాధిక శరత్ కుమార్
ఇటీవల స్టార్ నటి ఖూష్బూ కూతుళ్లను కొందరు టార్గెట్ చేసి మరీ దారుణం విమర్శలు గుప్పించారు.

దిశ, సినిమా: ఈ మధ్యకాలంలో సోషల్ మీడియా వాడకం ఎంతగా పెరిగిందో, అంతే స్థాయిలో నెగెటివిటీ కూడా పెరిగిపోతోంది. ముఖ్యంగా సినీ ఇండస్ట్రీకి చెందిన హీరోలు, హీరోయిన్లు, ప్రముఖుల పిల్లలను టార్గెట్ చేస్తూ జరుగుతున్న ట్రోలింగ్ రోజురోజుకూ హద్దులు దాటుతోంది. కేవలం సెలబ్రిటీల పిల్లలు అయినంత మాత్రాన.. వారి వ్యక్తిగత జీవితం, వారి శరీర రూపంపై అసభ్యకరంగా మాట్లాడటం కొందరికి అలవాటుగా మారిపోయింది. స్టార్ కిడ్స్ ఎలా కనిపిస్తున్నారు, ఎలాంటి బట్టలు వేసుకుంటున్నారు, లావుగా ఉన్నారా లేదా సన్నగా ఉన్నారా అనే విషయాలపై నిత్యం నిఘా పెడుతున్నారు. వారి రూపాన్ని ఎగతాళి చేస్తూ దారుణమైన కామెంట్లు పెడుతున్నారు. అయితే ఈ ట్రోలింగ్ గురించి కొందరు హెచ్చరిస్తుంటే మరికొందరు మాత్రం పట్టించుకోకుండా తమ పని చేసుకుంటూ పోతున్నారు. ఇటీవల స్టార్ నటి ఖూష్బూ కూతుళ్లను కొందరు టార్గెట్ చేసి మరీ దారుణం విమర్శలు గుప్పించారు. తప చిన్న కూతురు అనందిత ట్రాన్స్‌జెండర్‌లా ఉందంటూ కామెంట్లు పెట్టారు. ఇక ఈ విషయంపై ఖుష్బూ తీవ్రంగా స్పందించారు. "నా పిల్లలను ఎంతో పద్ధతిగా పెంచాను.
ఒక తల్లిగా నా పిల్లలకు జరిగే అవమానాన్ని నేను అస్సలు భరించను. ఇలాంటి నీచమైన కామెంట్లు చేసేవారికి అసలు మానవత్వమే లేదు. ఒక తల్లి జోలికి వస్తే ఎలా ఉంటుందో చూపిస్తా.. తన పిల్లలను కాపాడుకోవడానికి ప్రాణాలు తీయడానికైనా సిద్ధపడే గాయపడిన ఆడపులి లాంటిది తల్లి" అంటూ ఖుష్బూ గట్టి వార్నింగ్ ఇచ్చారు. ఖుష్బూకు మద్దతుగా నిలిచిన సీనియర్ నటి రాధికా శరత్ కుమార్ కూడా ఈ ట్రోలింగ్‌పై ఎంతో ఆవేదన వ్యక్తం చేస్తూ గట్టి కౌంటర్ ఇచ్చారు. "ఫేస్ బుక్, ట్విట్టర్లలో మాట్లాడే స్వేచ్ఛ ఉంది కదా అని ఎదుటివారిని బెదిరించడం, భయపెట్టడం కరెక్ట్ కాదు. విమర్శించడం వేరు, క్రూరత్వం చూపించడం వేరు. హాస్యం పేరుతో ఒకరిని అవమానించడం పద్ధతి కాదు. ప్రముఖుల కూతుళ్లను ఇలా ఎగతాళి చేయడం హాస్యం అనిపించుకోదు, అది కేవలం పిరికితనం మాత్రమే. మనుషుల రూపం ముఖ్యం కాదు, వారి వ్యక్తిత్వమే ముఖ్యం" అని రాసుకొచ్చారు.






