ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్

by Prasad Jukanti |

ఫోన్ ట్యాపింగ్ కేసులో మొదటిసారి పొరుగు రాష్ట్ర బ్యూరోక్రాట్ వాంగ్మూలాన్ని నమోదు చేశారు.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ట్విస్ట్.. ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ స్టేట్‌మెంట్ రికార్డ్
X

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ రాజకీయాలను షేక్ చేసిన ఫోన్ ట్యాపింగ్ కేసులో సిట్ దర్యాప్తు కొనసాగుతోంది. తాజాగా ఈ కేసులో ఏపీ రిటైర్డ్ ఐపీఎస్ స్టేట్‍మెంట్‍ను సిట్ అధికారులు రికార్డ్ చేశారు. తాజాగా రిటైర్డ్ ఐపీఎస్ ఏబీ వెంకటేశ్వరరావు వాంగ్మూలాన్ని అధికారులు నమోదు చేశారు. గతంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్‍గా ఏబి వెంకటేశ్వరరావు పని చేశారు. అయితే 2023లో వెంకటేశ్వరరావు కాల్ డేటా రికార్డింగ్స్ ను నిందితులు తీసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. దీంతో విట్‍నెస్ కింద వెంకటేశ్వరరావు స్టేట్ మెంట్ రికార్డు చేశారు. అయితే ఈ కేసులో ఇతర రాష్ట్రానికి చెందిన బ్యోరోక్రాట్ ను సిట్ అధికారులు విచారించడం ఇదే మొదటిసారికావడం గమనార్హం.

అనుబంధ అభిమోగ పత్రం సిద్ధం!:

ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ ముగింపునకు చేర్చినట్లు తెలుస్తోంది. గత ఐదున్నర నెలలుగా అహర్నిశలు సాగిన విచారణలో సిట్ అధికారులు సంచలన నిజాలను వెలుగులోకి తెచ్చారు. ఈ కుట్రలో ప్రధాన సూత్రధారిగా భావిస్తున్న ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్‌రావుతో పాటు పలువురు పోలీసు మాజీ అధికారులు, రాజకీయ నేతలపై పక్కా సాక్ష్యాలతో కూడిన తుది చార్జిషీట్ దాఖలు చేసేందుకు కసరత్తు ముమ్మరం చేసినట్లు సమాచారం. ఈ కేసు నిందితుల జాబితాలో ముగ్గురు బీఆర్ఎస్ ముఖ్యుల్ని చేర్చినట్లు గత కొంత కాలంగా ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో పక్క రాష్ట్రానికి చెందిన బ్యూరోక్రాట్ వాంగ్మూలాన్ని నమోదు చేయడంతో ఈ కేసు దర్యాప్తులో ఎలాంటి విషయాలు అంతిమంగా వెలుగులోకి రాబోతున్నాయనేది ఉత్కంఠగా మారింది.

Next Story