గ్రామకంఠం భూమికి రక్షణ.. హెచ్చరిక బోర్డు ఏర్పాటు

by Jakkula.Mamatha |

మండల కేంద్రంలోని 4వ వార్డులో ఉన్న గ్రామకంఠం ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు

గ్రామకంఠం భూమికి రక్షణ.. హెచ్చరిక బోర్డు ఏర్పాటు
X

దిశ, ఊట్కూర్: మండల కేంద్రంలోని 4వ వార్డులో ఉన్న గ్రామకంఠం ప్రభుత్వ భూమిని ఆక్రమణల నుంచి రక్షించేందుకు పంచాయతీ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రజావాణిలో అందిన ఫిర్యాదు మేరకు మంగళవారం సర్పంచ్ రేణుక భరత్, పంచాయతీ కార్యదర్శి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో సిబ్బంది స్థలాన్ని పరిశీలించి అధికారిక హద్దులు గుర్తించారు. సుమారు 450 గజాల ప్రభుత్వ భూమిలో భవిష్యత్తులో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా ఉండేలా ప్రభుత్వ భూమి అని పేర్కొంటూ హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. అలాగే భూమి సరిహద్దులను స్పష్టంగా తెలియజేసేందుకు రాళ్లను పాతిపెట్టారు. కొద్ది రోజుల క్రితం ఇదే స్థలంలో అనుమతులు లేకుండా ప్రహరీ నిర్మాణం చేపట్టినట్లు వచ్చిన ఫిర్యాదుపై విచారణ జరిపిన అధికారులు అప్పటికే నిర్మాణ పనులను నిలిపివేశారు. ఇకపై ప్రభుత్వ భూములను ఆక్రమించేందుకు లేదా అక్రమ నిర్మాణాలు చేపట్టేందుకు ప్రయత్నిస్తే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

Next Story