ప్రజాసేవలో ఆదర్శంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్

by Ratna Kumari |

విధి నిర్వహణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను చాటుకుంటూ పెద్దపల్లి జిల్లాకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ ఆదర్శంగా నిలిచారు.

ప్రజాసేవలో ఆదర్శంగా ట్రాఫిక్ కానిస్టేబుల్ అనిల్
X

దిశ, పెద్దపల్లి : విధి నిర్వహణకే పరిమితం కాకుండా సామాజిక బాధ్యతను చాటుకుంటూ పెద్దపల్లి జిల్లాకు చెందిన ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ ఆదర్శంగా నిలిచారు. వాహనదారులు ప్రమాదాల బారిన పడకుండా ఉండాలనే ఉద్దేశంతో తన సొంత ఖర్చుతో రహదారిపై ఉన్న గుంతలను పూడ్చించి ప్రజల ప్రశంసలు అందుకుంటున్నారు. పెద్దపల్లి బస్ స్టాండ్ పరిసర ప్రాంతంలోని ప్రధాన రహదారిపై పెద్ద గుంతలు ఏర్పడి వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ గుంతల కారణంగా తరచూ ప్రమాదాలు చోటుచేసుకుంటుండటాన్ని అక్కడే విధులు నిర్వహిస్తున్న ట్రాఫిక్ కానిస్టేబుల్ సిరికొండ అనిల్ గమనించారు.

ప్రమాదాలను నివారించాలనే సంకల్పంతో ఆయన ఎలాంటి అధికారిక ఆదేశాల కోసం ఎదురుచూడకుండా, తన సొంత డబ్బుతో మట్టిని తెప్పించి స్వయంగా రోడ్డు గుంతలను పూడ్చించారు. దీంతో రహదారిపై ప్రయాణం సురక్షితంగా మారడంతో వాహనదారులు ఊపిరి పీల్చుకున్నారు. ట్రాఫిక్ నియంత్రణ బాధ్యతలతో పాటు ప్రజల ప్రాణ భద్రతకు ప్రాధాన్యత ఇస్తూ స్వచ్ఛందంగా ముందుకొచ్చిన కానిస్టేబుల్ అనిల్ సేవలను స్థానికులు, వాహనదారులు, పోలీసు ఉన్నతాధికారులు అభినందిస్తున్నారు. ప్రజా సేవ పట్ల ఆయన చూపిన నిబద్ధత పలువురికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తోందని స్థానికులు పేర్కొన్నారు.

Next Story