విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలి: ఏబీవీపీ

by Ratna Kumari |

రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మంగళవారం మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ మండలాల్లోని పలు కళాశాలలు బంద్ నిర్వహించారు.

విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి నియమించాలి: ఏబీవీపీ
X

దిశ, మక్తల్ : రాష్ట్రంలో పెండింగ్‌లో ఉన్న రూ.11 వేల కోట్ల ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ (ఏబీవీపీ) ఆధ్వర్యంలో మంగళవారం మక్తల్, మాగనూరు, కృష్ణ, నర్వ మండలాల్లోని పలు కళాశాలలు బంద్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు వినయ్ కుమార్ మాట్లాడుతూ, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చి మూడు సంవత్సరాలు గడిచినా విద్యార్థులకు అందాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్ బకాయిలను విడుదల చేయకపోవడం వల్ల వేలాది మంది విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని విమర్శించారు.

రాష్ట్రంలో విద్యాశాఖకు ప్రత్యేక మంత్రి లేకపోవడంతో విద్యా సమస్యలు రోజురోజుకు పెరుగుతున్నాయని, విద్యా వ్యవస్థ పట్ల ప్రభుత్వ నిర్లక్ష్యానికి ఇదే నిదర్శనమని ఆయన అన్నారు. బీసీ, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీయింబర్స్‌మెంట్, స్కాలర్‌షిప్‌లు అందకపోవడంతో అనేక కళాశాలలు విద్యార్థుల సర్టిఫికెట్లను నిలిపివేస్తున్నాయని, దీంతో వారు ఉద్యోగ అవకాశాలను కోల్పోయి నిరుద్యోగులుగా మారుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పెండింగ్ బకాయిలను విడుదల చేసి విద్యార్థుల సమస్యలను పరిష్కరించాలని, విద్యాశాఖకు ప్రత్యేక మంత్రిని నియమించాలని ఏబీవీపీ నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సందీప్, నాని, మూర్తి, అరవింద్, చక్రి, నవీన్, మాయ, అక్షయ్, మాగనూరు మండల కన్వీనర్ సాయి కిషోర్ గౌడ్, నవీన్, మధు, మహేష్, అక్షయ్, ఆకాశ్, లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.

Next Story