ఇక వాట్సాప్‌లో ఆ ఫీచర్ కూడా..! త్వరలో రోల్‌ అవుట్?

by Javid Pasha |

కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారి బర్త్‌డేలు వచ్చినప్పుడు మీ వాట్సాప్‌లోని ఆ ఫీచర్‌లో రిమైండర్ వస్తుంది.

ఇక వాట్సాప్‌లో ఆ ఫీచర్ కూడా..! త్వరలో రోల్‌ అవుట్?
X

దిశ, ఫీచర్స్ : వాట్సాప్ యూజర్లకు గుడ్‌న్యూస్.. ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లతో ఆకట్టుకుంటున్న ఈ ప్లాట్‌ఫామ్ మరో కొత్త విషయంతో మనముందుకొచ్చింది. ఏంటంటే.. తన యూజర్లకు మరింత సౌకర్యం కల్పించేందుకు బర్త్‌డే రిమైండర్ ఫీచర్‌ను అభివృద్ధి చేస్తోంది. దీని ద్వారా.. వినియోగదారులు తమ కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారి బర్త్‌డేలను చాలా ఈజీగా గుర్తుంచుకొని విష్ చేసే అవకాశం ఏర్పడుతుందని నిపుణులు అంటున్నారు. అంతేకాదు రాబోయే పుట్టినరోజులను ప్రత్యేక సెక్షన్‌లో చూపించడం, బర్త్‌డే రోజున నోటిఫికేషన్ పంపడం, నేరుగా చాట్‌కి వెళ్లి శుభాకాంక్షలు చెప్పడం వంటి సౌకర్యాలు ఈ కొత్త ఫీచర్‌లో ఉంటాయి. అయితే ప్రస్తుతం ఇధి అభివృద్ధి దశలో ఉంది. సమీప భవిష్యత్తులో యాప్ అప్‌డేట్‌లో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

వాట్సాప్ కొత్తగా డెవలప్ చేస్తున్న ఫీచర్ WhatsApp బీటా వెర్షన్ (Android 2.26.27.3)లో ఇప్పటికే గుర్తించబడింది. ప్రస్తుతం Android బీటా టెస్టర్లకు మాత్రమే పరిమితంగా ఉంది. దీని ప్రకారం.. యూజర్లు తమ ప్రొఫైల్‌లో బర్త్‌డే తేదీని జోడించవచ్చు(ఆప్షనల్). అయితే కాంటాక్ట్ లిస్టులో ఉన్నవారి బర్త్‌డేలు వచ్చినప్పుడు మాత్రం యాప్‌లోనే రిమైండర్ వస్తుంది. పూర్తిస్థాయిలో అభివృద్ధి చెందాక ప్రైవసీ కంట్రోల్స్‌తో వస్తుందని నిపుణులు అంటున్నారు. అదే జరిగితే.. ఈ కొత్త ఫీచర్ వల్ల యూజర్లు ప్రత్యేక రిమైండర్ యాప్‌లు ఉపయోగించకుండా వాట్సాప్‌లోనే బర్త్‌డేలను గుర్తుచేసుకొని, స్నేహితులు, కుటుంబ సభ్యులను విష్ చేయవచ్చు. ముందస్తు ప్రణాళికతో సెలబ్రేట్ చేసుకోవచ్చు.

Next Story