ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి

by Taduka Kalyani |

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు.

ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలి
X

దిశ, కొల్చారం : ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులు వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. మంగళవారం మండల కేంద్రమైన కొల్చారంలో జరుగుతున్న ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణం పనులను పరిశీలించారు. పనులను వేగవంతం చేయాలని లబ్ధిదారులకు సూచించారు. ఇంకా ఇళ్ల నిర్మాణం ప్రారంభించని లబ్ధిదారులతో ప్రత్యేకంగా మాట్లాడారు. వెంటనే నిర్మాణం పనులు ప్రారంభించాలని లబ్ధిదారులకు సూచించారు. ఇండ్ల నిర్మాణం పనులు ప్రారంభించకుంటే రద్దు అయ్యే అవకాశం ఉందని తెలిపారు. బిస్మిట్ వరకు పూర్తికాగానే మొదటి బిల్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. లబ్ధిదారులకు భారం కాకుండా ఉండేందుకు చిన్న సైజులో 450 ఫీట్ల నుండి నిర్మాణం చేసుకోవచ్చని తెలిపారు. ఇంకా ఇండ్ల నిర్మాణం ప్రారంభించన లబ్ధిదారులు వెంటనే ప్రారంభించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గృహ నిర్మాణ శాఖ పిడి మాణిక్యం, కొల్చారం తహసిల్దార్ శ్రీనివాసచారి, ఎంపీడీవో రఫిక్ ఉన్నిసా బేగం కొల్చారం సర్పంచ్ దేవన్న గారి శేఖర్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

Next Story