స్నేహితుడే హంతకుడు.. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ

by Batti.Sumithra |

నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇటీవల ఎన్.ఆర్ గార్డెన్ సమీపంలోని బ్రిడ్జి కింద ఓ వ్యక్తి విగతజీవిగా పడి మరణించి ఉండగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి, చేదించారు.

స్నేహితుడే హంతకుడు.. వివరాలు వెల్లడించిన ఏఎస్పీ
X

దిశ, బైంసా : నిర్మల్ జిల్లా భైంసా పట్టణంలో ఇటీవల ఎన్.ఆర్ గార్డెన్ సమీపంలోని బ్రిడ్జి కింద ఓ వ్యక్తి విగతజీవిగా పడి మరణించి ఉండగా.. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆ కేసును దర్యాప్తు చేసి, చేదించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చిన విషయాలను మంగళవారం ఏఎస్పీ పత్తిపాక సాయి కిరణ్ మీడియాకి వెల్లడించారు. నయా ఆబాదికి చెందిన నసీర్ అహ్మద్ (27) ని అతని స్నేహితుడు మొహమ్మద్ సఫ్రాన్ అహ్మద్ (19) హత్య చేశాడని పేర్కొన్నారు.

గతంలో జరిగిన డబ్బుల వివాదం కారణంగా నసీర్ గ్యారేజీలో ఇద్దరి మధ్య గొడవ చోటు చేసుకోగా, నిందితుడు అక్కడ ఉన్న రెండు సుత్తులతో నసీర్ అహ్మద్ తల పై పలుమార్లు దాడి చేసి హత్య చేసినట్లు దర్యాప్తులో తేలిందని అన్నారు. అనంతరం నేరాన్ని దాచిపెట్టేందుకు మృతదేహాన్ని ఐరన్ మెషిన్ బాక్స్‌లో ఉంచి, మోటార్‌ సైకిల్‌ పై తీసుకెళ్లి ఆటోనగర్ చోటా బ్రిడ్జి సమీపంలోని మురికి కాలువలో పడవేసినట్లు పోలీసులు వెల్లడించారు. సఫ్రాన్ అహ్మద్‌ను అదుపులోకి తీసుకుని విచారించగా, దర్యాప్తులో సేకరించిన శాస్త్రీయ, సాంకేతిక ఆధారాల ఆధారంగా నేరంలో అతని ప్రమేయం నిర్ధారణ అయినట్లు తెలిపారు. ఈ కేసు ఛేదనలో సీసీటీవీ ఫుటేజీలు, డిజిటల్ సాక్ష్యాలు, శాస్త్రీయ ఆధారాలు కీలక పాత్ర పోషించాయని, కేసుకు సంబంధించిన తదుపరి దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు తెలిపారు.

Next Story