భార్య పుట్టినరోజునాడే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన భర్త

by Ajay Maddhiboyina |   (  Updated:2026-07-14 08:19:36  IST  )

భార్య పుట్టినరోజునాడే ఓ భర్త ఆమెను నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 2023లో మనీష్ భాటి అనే వ్యక్తితో ప్రియాంక అనే మహిళకు వివాహం వివాహం జరిగింది.

భార్య పుట్టినరోజునాడే నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి చంపిన భర్త
X

దిశ, వెబ్ డెస్క్: భార్య పుట్టినరోజునాడే ఓ భర్త ఆమెను నడిరోడ్డుపై తుపాకీతో కాల్చి హత్య చేశాడు. ఈ దారుణ ఘటన ఢిల్లీలోని వినోద్ నగర్ ప్రాంతంలో చోటు చేసుకుంది. 2023లో మనీష్ భాటి అనే వ్యక్తితో ప్రియాంక అనే మహిళకు వివాహం వివాహం జరిగింది. మనీష్ ఢిల్లీ పోలీసు విభాగంలోని యాంటీ ఆటో థెఫ్ట్ స్క్వాడ్ (AATS) లో విధులు నిర్వహిస్తుండగా ప్రియాంక ఇంటి వద్దే ఉంటోంది. కాగా ప్రియాంక పుట్టిన రోజు సందర్భంగా దంపతులు ఇద్దరూ రాత్రి 2గంటలకు బయటకు వెళ్లారు. ఈ క్రమంలో వారికి వాగ్వాదం జరగ్గా మార్గ మధ్యలో లాల్ బహదూర్ శాస్త్రి ఆస్పత్రి సమీపంలో ప్రియాంక బండి దిగిపోయింది.

దీంతో కోపంతో రగిలిపోయిన మీనీష్ తుపాకీతో ఆమెపై కాల్పులు జరిపి అక్కడ నుండి పరార్ అయ్యాడు. తీవ్ర రక్తస్రావంతో రోడ్డుపై పడి ఉన్న ప్రియాంకను గమనించిన ఓ డెలివరీ బాయ్ వెంటనే ఆసుపత్రికి తరలించగా, అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. ఇంటి నుండి బయల్దేరడానికి ముందు కూడా ఇద్దరి మధ్య గొడవ జరిగిందని స్థానికులు చెబుతున్నారు. 2024లో కట్నం కోసం మనీష్ భార్య ప్రియాంకను వేధించడంతో.. అప్పుడు 8 నెలల పాటు తమ సోదరుడి ఇంట్లో ప్రియాంక ఉందని కుటుంబ సభ్యులు వెల్లడించారు. పరారీలో ఉన్న మనీష్ కోసం పోలీసులు ప్రత్యేక బృందాల‌తో గాలిస్తున్నారు.

అధిక లాభాలంటూ ఆశ.. రూ.21 కోట్లు మోసపోయిన చార్టెడ్ అకౌంటెడ్

Next Story