- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
బాలికల గురుకుల హాస్టల్‌ను మున్సిపల్ కమిషనర్ ఆకస్మిక తనిఖీ
కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/జూనియర్ కళాశాల(TGRWRS/JC) హాస్టల్‌ను మున్సిపల్ కమిషనర్ జి. సాయి కృష్ణ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు.

దిశ,కల్లూరు: కల్లూరు మున్సిపాలిటీ పరిధిలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల/జూనియర్ కళాశాల(TGRWRS/JC) హాస్టల్‌ను మున్సిపల్ కమిషనర్ జి. సాయి కృష్ణ రెడ్డి మంగళవారం ఆకస్మికంగా సందర్శించి తనిఖీ చేశారు. విద్యార్థినులకు కల్పిస్తున్న మౌలిక వసతులు, పరిశుభ్రత, పారిశుధ్య నిర్వహణ, భద్రతా ఏర్పాట్లపై ప్రత్యేకంగా దృష్టి సారించారు. తనిఖీలో భాగంగా డైనింగ్ హాల్, వంటశాల, స్పోర్ట్స్ ఏరియా, డ్రైనేజీ వ్యవస్థ, హాస్టల్ పరిసరాలను క్షుణ్ణంగా పరిశీలించారు. విద్యార్థినులకు పరిశుభ్రమైన, సురక్షితమైన, ఆరోగ్యకరమైన వాతావరణంలో అన్ని సౌకర్యాలు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా కమిషనర్ విద్యార్థినులతో నేరుగా మాట్లాడి వారికి అందుతున్న ఆహారం, తాగునీరు, వసతి, పారిశుధ్య నిర్వహణ, క్రీడా సదుపాయాలపై ఆరా తీశారు. విద్యార్థినులు ఎలాంటి సమస్యలు ఎదుర్కొన్నా వెంటనే హాస్టల్ యాజమాన్యం దృష్టికి తీసుకురావాలని సూచించారు.
వర్షాకాలాన్ని దృష్టిలో ఉంచుకుని హాస్టల్ పరిసరాల్లో ప్రత్యేక పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని, దోమల నివారణ, వ్యర్థాల నిర్వహణ, డ్రైనేజీ వ్యవస్థను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ ఎలాంటి సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. అనంతరం హాస్టల్ నిర్వహణ, విద్యార్థినుల సంక్షేమానికి సంబంధించిన పలు అంశాలపై అధికారులతో సమీక్ష నిర్వహించిన కమిషనర్, విద్యార్థినుల ఆరోగ్యం, పరిశుభ్రత, భద్రత, క్రీడా సదుపాయాల నిర్వహణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు. హాస్టళ్లలో పరిశుభ్రత, భద్రత విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదు" అని మున్సిపల్ కమిషనర్ పేర్కొన్నారు. హాస్టల్ నిర్వహణ, పరిశుభ్రత, విద్యార్థినులకు కల్పిస్తున్న సౌకర్యాలపై సంతృప్తి వ్యక్తం చేస్తూ పాఠశాల/కళాశాల యాజమాన్యాన్ని అభినందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపల్ పి. కనకదుర్గ, వైస్ ప్రిన్సిపాల్ బి. పద్మ, శానిటరీ ఇన్‌స్పెక్టర్ కె రమేష్ , హాస్టల్ సిబ్బంది పి.డి.పి.టి. చిమ్మట త్రివేణి,పీఈటీ సాదం పద్మ తదితరులు పాల్గొన్నారు.






