- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం.. రాష్ట్రంలో 'SIR' ప్రక్రియ గడువు పొడిగింపు
ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్‌డెస్క్: ఆంధ్రప్రదేశ్ ఓటర్ల జాబితాల ప్రత్యేక సవరణ కోసం కేంద్ర ఎన్నికల సంఘం చేపట్టిన స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియ గడువును పొడిగిస్తూ ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. షెడ్యూల్ ప్రకారం ఈ ప్రక్రియ నేటితో (జులై 14) ముగియాల్సి ఉండగా, రాజకీయ పార్టీల విజ్ఞప్తులు, క్షేత్రస్థాయి పరిస్థితులను పరిగణనలోకి తీసుకుని ఈ గడువును జులై 24వ తేదీ వరకు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రవ్యాప్తంగా ఓటర్ల జాబితాల సవరణ ప్రక్రియ ఇంకా పూర్తి కాకపోవడంతో ఈ గడువు పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు.
ఎన్యుమరేషన్ ఫారాల పంపిణీలో ఆలస్యం..
పలు ప్రాంతాల్లో ఓటర్లకు ఇంకా ఎన్యుమరేషన్ ఫారాలు అందకపోవడం, కొన్ని చోట్ల ఓటర్లు ఫారాలు పూర్తి చేసి సిద్ధంగా ఉంచినా, బూత్ లెవెల్ అధికారులు (BLOS) వాటిని తిరిగి సేకరించడంలో ఆలస్యం చేయడం, ఓటర్ల నుంచి సేకరించిన వివరాలను ఆన్లైన్‌లో నమోదు చేసే (డిజిటలైజేషన్) ప్రక్రియ ఇంకా పూర్తికాకపోవడం, ఈ సాంకేతిక, పరిపాలనాపరమైన ఇబ్బందుల వల్ల అర్హులైన అనేకమంది ఓటర్లు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం ఉందని వివిధ రాజకీయ పార్టీలు ఆందోళన వ్యక్తం చేశాయి. తక్షణమే స్పందించి ఎస్ఐఆర్ ప్రక్రియ గడువును పొడిగించాలని ఎన్నికల సంఘాన్ని డిమాండ్ చేశాయి. పార్టీలు విజ్ఞప్తులపై సానుకూలంగా స్పందించిన ఈసీ, ఓటర్ల నమోదు, సవరణలు సజావుగా సాగేందుకు వీలుగా మరో పది రోజుల పాటు సమయాన్నీ పొడిగించింది. తాజా ఉత్తర్వుల ప్రకారం, ఓటర్లు జులై 24వ తేదీ లోపు తమ వివరాల సవరణలు, కొత్త నమోదు ప్రక్రియను పూర్తి చేసుకోవచ్చని అధికారులు వెల్లడించారు.






