తల్లాడ మండల కాంగ్రెస్ నేత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నుమూత

by Jakkula.Mamatha |

తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి(ఎక్స్ ఎంపీటీసీ) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు.

తల్లాడ మండల కాంగ్రెస్ నేత, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు కన్నుమూత
X

దిశ,తల్లాడ: తల్లాడ మండల కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, బ్లాక్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ఎంపీటీసీ దగ్గుల రఘుపతి రెడ్డి(ఎక్స్ ఎంపీటీసీ) మంగళవారం మధ్యాహ్నం కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన, హైదరాబాద్‌లోని ఒక ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ.. ఈరోజు మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో ముగింపు శ్వాస విడిచారు. రఘుపతి రెడ్డి మృతి పట్ల తల్లాడ మండల కాంగ్రెస్ శ్రేణులు, స్థానిక ప్రజలు తీవ్ర దిగ్భ్రాంతిని, సంతాపాన్ని వ్యక్తం చేశారు. మండలంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆయన చేసిన సేవలను ఈ సందర్భంగా పలువురు నాయకులు స్మరించుకున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని, వారి కుటుంబ సభ్యులకు భగవంతుడు ధైర్యాన్ని ప్రసాదించాలని ఆకాంక్షిస్తూ పలువురు రాజకీయ ప్రముఖులు తమ ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.

Next Story