- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
CBSE మరో నిర్ణయం.. థర్డ్ లాంగ్వేజ్ పాస్ అవ్వాల్సిందే!
సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మరో కీలక నిర్ణయం తీసుకుంది.

దిశ, వెబ్ డెస్క్ : సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (CBSE) మరో కీలక నిర్ణయం తీసుకుంది. జాతీయ విద్యా విధానం (NEP)ప్రకారం, 10వ తరగతి విద్యార్థులకు 'థర్డ్ లాంగ్వేజ్' సబ్జెక్టులో పాస్ అవ్వడాన్ని ఇకపై తప్పనిసరి చేయనుంది. ఇప్పటివరకు ఉన్న నిబంధనల ప్రకారం.. 10వ తరగతిలో థర్డ్ లాంగ్వేజ్ అనేది వరకు ఆప్షనల్‌గా ఉండేది. ఒకవేళ ఆ సబ్జెక్టులో విద్యార్థి ఫెయిల్ అయినా కూడా, మిగిలిన ప్రధాన సబ్జెక్టులలో మార్కులను బట్టి ఓవరాల్‌గా పాస్ అయినట్లు బోర్డు ప్రకటించేది. కానీ, సరికొత్త నిబంధనల ప్రకారం.. విద్యార్థులు థర్డ్ లాంగ్వేజ్ సబ్జెక్టులో కూడా ఇతర సబ్జెక్టుల మాదిరిగానే కనీసం 33 శాతం, అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి తప్పనిసరిగా ఉత్తీర్ణులు కావాల్సి ఉంటుంది.
విద్యార్థులలో బహుభాషా నైపుణ్యాలను పెంపొందించడం, భారతీయ, అంతర్జాతీయ భాషలపై పట్టు సాధించేలా చేయడం ఈ నిర్ణయం యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఈ సరికొత్త విద్యా విధానాన్ని రాబోయే 2026-27 విద్యా సంవత్సరం నుండి ప్రయోగాత్మకంగా అమలులోకి తీసుకురావాలని సిబిఎస్‌ఈ యోచిస్తోంది. అయితే దీనికి సంబంధించిన ఖచ్చితమైన తేదీలు, సమగ్ర మార్గదర్శకాలపై బోర్డు నుండి అధికారిక ప్రకటన వెలువడాల్సి ఉంది.






