- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
108 అంబులెన్స్ సేవలపై నేషనల్ క్వాలిటీ ఆడిట్
అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో 108, 102, నియోనటల్ అంబులెన్స్ సేవలపై నేషనల్ క్వాలిటీ ఆడిట్ నిర్వహించారు.

దిశ, తుర్కయంజాల్: అత్యవసర పరిస్థితుల్లో ప్రజలకు అందుతున్న వైద్య సేవల నాణ్యతను మరింత మెరుగుపరిచే లక్ష్యంతో 108, 102, నియోనటల్ అంబులెన్స్ సేవలపై నేషనల్ క్వాలిటీ ఆడిట్ నిర్వహించారు. ఎల్బీనగర్, హయత్‌నగర్, ఇంజాపూర్ కేంద్రాల్లో మంగళవారం నేషనల్ క్వాలిటీ ఆడిటర్ ఫయాజ్ షేక్ సమగ్ర తనిఖీలు చేపట్టారు. 108 సిబ్బంది పనితీరు, అంబులెన్స్‌లలో అందుబాటులో ఉన్న వైద్య సదుపాయాలు, అత్యవసర సేవల నిర్వహణ తీరును ఆడిటర్ పరిశీలించారు. అంబులెన్స్‌లలో ఉన్న ఆక్సిజన్ సిలిండర్లు, సక్షన్ యంత్రాలు, పేషెంట్ మానిటర్లు, స్ట్రెచర్లు తదితర అత్యవసర వైద్య పరికరాల పనితీరును క్షుణ్ణంగా తనిఖీ చేశారు. అలాగే మందుల నిల్వలు, వాటి గడువు తేదీలు, స్టాక్ రిజిస్టర్లు, పేషెంట్ కేర్ రికార్డులు, కాల్ లాగ్ బుక్స్ వంటి కీలక రికార్డులను పరిశీలించారు. అత్యవసర సమయాల్లో వేగంగా స్పందించి మెరుగైన వైద్య సేవలు అందించేందుకు అవసరమైన ప్రమాణాలు పాటిస్తున్నారా అనే అంశాలను కూడా సమీక్షించారు. ఈ ఆడిట్‌లో ఎమర్జెన్సీ మెడికల్ టెక్నీషియన్లు సురేష్, రఘు, కృష్ణతో పాటు పైలెట్లు రవికుమార్, లక్ష్మీకాంత్ రెడ్డి, కృష్ణ నవీన్ పాల్గొన్నారు. అంబులెన్స్ సేవలకు సంబంధించిన వివరాలను వారు ఆడిటర్‌కు అందించారు. ఈ సందర్భంగా జిల్లా మేనేజర్ రాజబాబు మాట్లాడుతూ.. ప్రజలకు అత్యవసర సమయాల్లో వేగవంతమైన, నాణ్యమైన వైద్య సేవలు అందించడమే 108 అంబులెన్స్ సేవల ప్రధాన లక్ష్యమని తెలిపారు. సేవల ప్రమాణాలను మరింత పెంచేందుకు ఇలాంటి నాణ్యతా తనిఖీలు ఎంతో ఉపయోగపడతాయని పేర్కొన్నారు.






