అది ఎంత పెద్ద పాత్ర అయినా సరే అలాంటి బట్టలు వేసుకోమంటే చాన్స్ వదులుకుంటా: కాజల్ అగర్వాల్

by Mallepaka Hamsa |

అలాగే హద్దులు దాటిన రొమాంటిక్ సీన్స్‌లో కూడా ఎట్టిపరిస్థితుల్లో నటించనని ఆమె ఖరాఖండిగా చెప్పారు.

అది ఎంత పెద్ద పాత్ర అయినా సరే అలాంటి బట్టలు వేసుకోమంటే చాన్స్ వదులుకుంటా: కాజల్ అగర్వాల్
X

దిశ, సినిమా: స్టార్ హీరోయిన్ కాజల్ అగర్వాల్ పెళ్లి చేసుకుని, ఒక బిడ్డకు తల్లి అయినప్పటికీ గ్లామర్ విషయంలో ఎక్కడా తగ్గడం లేదు. తన సెకండ్ ఇన్నింగ్స్‌లో కూడా వరుస సినిమాలతో దూసుకుపోతున్న ఈ చందమామ.. అటు సోషల్ మీడియాలో కూడా హాట్ ఫొటోలు షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. ప్రస్తుతం ఈ బ్యూటీ నటించిన ‘ది ఇండియా స్టోరీ’ సినిమా విడుదలకు సిద్ధంగా ఉంది. షూటింగ్ పనులన్నీ పూర్తి చేసుకున్న ఈ చిత్రం జూలై 24న థియేటర్లలోకి రాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్ కోసం ఇంటర్వ్యూలు ఇస్తున్న కాజల్.. తాజాగా ఒక ఆసక్తికరమైన ప్రశ్నపై ఎంతో ధైర్యంగా స్పందించారు. భవిష్యత్తులో బికినీ వేసుకునే పాత్రలు వస్తే నటిస్తారా? అనే ప్రశ్నకు కాజల్ అగర్వాల్ ఎవరూ ఊహించని విధంగా సమాధానమిచ్చారు. తనకు బికినీ వేసుకోవడం అస్సలు ఇష్టం ఉండదని, అలాగే హద్దులు దాటిన రొమాంటిక్ సీన్స్‌లో కూడా ఎట్టిపరిస్థితుల్లో నటించనని ఆమె ఖరాఖండిగా చెప్పారు.

నటిగా కెరీర్ ప్రారంభించినప్పటి నుంచి తనకంటూ కొన్ని హద్దులు, నియమాలు పెట్టుకున్నానని, వాటిని ఎప్పుడూ దాటబోనని స్పష్టం చేశారు. ఒకవేళ ఖచ్చితంగా బికినీ వేసుకోవాలని ఎవరైనా పట్టుబడితే.. అలాంటి అవకాశాలను చేతులారా వదులుకోవడానికైనా సిద్ధమే తప్ప తన పద్ధతిని మార్చుకోనని కాజల్ తేల్చి చెప్పారు. అది ఎంత భారీ బడ్జెట్ సినిమా అయినా, ఎంతటి పెద్ద స్టార్ ప్రాజెక్ట్ అయినా, చివరకు సినిమాలో అది ఎంత ముఖ్యమైన పాత్ర అయినా సరే.. తన పరిమితులకు లోబడి లేకపోతే నిర్మొహమాటంగా తిరస్కరిస్తానని వెల్లడించారు. నటన విషయంలో తన సిద్ధాంతాలకు కట్టుబడి ఉంటానని, జీవితంలో వాటిని కచ్చితంగా పాటిస్తానని కాజల్ చెప్పిన మాటలు ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఒకప్పుడు గ్లామర్ డోస్‌తో అందరినీ ఆశ్చర్యపరిచిన కాజల్ ఇప్పుడిలా మాట్లాడటంతో అంతా ఆశ్చర్యపోతున్నారు.

Next Story