చెలరేగుతున్న భారత పేసర్లు.. కుప్పకూలిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్

by Gantepaka Srikanth |

ఇంగ్లండ్‌తో బర్మింగ్ హామ్ (ఎడ్జ్ బాస్టన్) వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్లు చెలరేగుతున్నారు. అద్భుతమైన స్పెల్స్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బతీశారు.

చెలరేగుతున్న భారత పేసర్లు.. కుప్పకూలిన ఇంగ్లండ్ టాప్ ఆర్డర్
X

దిశ, వెబ్‌డెస్క్: ఇంగ్లండ్‌తో బర్మింగ్ హామ్ (ఎడ్జ్ బాస్టన్) వేదికగా జరుగుతోన్న తొలి వన్డే మ్యాచ్‌లో భారత పేస్ బౌలర్లు చెలరేగుతున్నారు. అద్భుతమైన స్పెల్స్‌తో ఇంగ్లండ్ బ్యాటింగ్ లైనప్‌ను కోలుకోలేని దెబ్బతీశారు. ఒకానొక దశలో వికెట్ నష్టపోకుండా 61 పరుగులతో పటిష్టంగా కనిపించిన ఇంగ్లండ్ జట్టును భారత బౌలర్లు తమ ప్రతాపంతో ఒక్కసారిగా ఆత్మరక్షణలో పడేశారు. కేవలం 19 పరుగుల వ్యవధిలోనే ఇంగ్లండ్ ఏకంగా 5 వికెట్లు కోల్పోవడం గమనార్హం. 61 పరుగుల వద్ద తొలి వికెట్ పడగొట్టిన భారత్.. ఆ తర్వాత పరుగుల వేగానికి కట్టడి చేస్తూ వరుస విరామాల్లో వికెట్లను కూల్చింది. జట్టు స్కోరు 80 పరుగులకు చేరేసరికి ఇంగ్లండ్ సగం వికెట్లను కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడింది. భారత బౌలర్లలో యువ పేసర్ గుర్నూర్ బ్రార్ అద్బుతమైన లైన్ అండ్ బౌలింగ్‌తో 2 వికెట్లు తీయగా, సీనియర్ పేసర్ ప్రసిద్ధ కృష్ణ సైతం నిలకడగా బౌలింగ్ చేస్తూ 2 వికెట్లను తన ఖాతాలో వేసుకున్నాడు. ఇక స్టార్ జస్ప్రీత్ బుమ్రా కూడా ఒక వికెట్‌తో ఇంగ్లండ్ పతనానికి ఆజ్యం పోశాడు. ప్రస్తుతం క్రీజులో స్టార్ బ్యాటర్ జో రూట్, విల్ జాక్స్ ఉన్నారు. భారత్ వికెట్ల వేటను ఇలాగే కొనసాగించి ఇంగ్లండ్‌ను స్వల్ప స్కోరుకే పరిమితం చేయాలని చూస్తోంది.

Next Story