- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
కడియం వర్సెస్ కొండా సురేఖ వార్.. మంత్రికి మీనాక్షి కీలక సూచన
దేవాదాయ శాఖ సమీక్ష వివాదంపై ఏఐసీసీ ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‌ను మంత్రి కొండా సురేఖ కలిశారు.

దిశ, డైనమిక్ బ్యూరో: తెలంగాణ కాంగ్రెస్‌లో స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి (Kadiyam Srihari) వర్సెస్ మంత్రి కొండా సురేఖ (Konda Surekha) మధ్య విభేదాలు చివరకు పార్టీ అధిష్టానం వద్దకు చేరాయి. ఈ ఇద్ధరు నేతల మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా విభేదాలు కొనసాగుతున్న వేళ ఏఐసీసీ రాష్ట్ర కాంగ్రెస్ వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్‍తో (Meenakshi Natarajan) మంత్రి కొండా సురేఖ ఇవాళ హైదరాబాద్‍లో భేటీ అయ్యారు. తాజాగా ఆమెను కలిసిన మంత్రి కొండా సురేఖ, కడియం శ్రీహరి తీరుపై నాలుగు పేజీల ఫిర్యాదు లేఖనుం అందజేశారు.
ఆత్మగౌరవం దెబ్బతీస్తున్నారని ఆవేదన:
నాక్షి నటరాజన్‌తో జరిగిన భేటీలో కొండా సురేఖ తన అసంతృప్తిని వ్యక్తం చేసినట్లు సమాచారం. కడియం శ్రీహరి వ్యవహారశైలిపై సుమారు నాలుగు పేజీల ఫిర్యాదు లేఖను మీనాక్షి నటరాజన్ కు అందజేసిన కొండా సురేఖ తనకు సమాచారం ఇవ్వకుండా, తన పరిధిలోని దేవాదాయ శాఖపై కడియం శ్రీహరి సమీక్షలు నిర్వహించడం పరిపాలనా వ్యవస్థకు విరుద్ధమని ఆమె తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇది తన ఆత్మగౌరవాన్ని దెబ్బతీసేలా ఉందని, తనను కావాలనే ఇబ్బందులకు గురి చేస్తున్నారని సురేఖ ఆవేదన వ్యక్తం తెలుస్తోంది. తన పని తాను చేసుకుంటుంటే, అనవసరంగా వివాదాల్లోకి లాగుతున్నారని, కడియం శ్రీహరి తీరు సరికాదని ఆమె ఇంఛార్జికి వివరించినట్లు తెలుస్తోంది. అయితే కడియం శ్రీహరి విషయాన్ని ఇప్పటికే సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్, ఏఐసీసీ పెద్దలకు ఫిర్యాదు చేసిన మంత్రి.. ఇవాళ మీనాక్షి నటరాజన్ దృష్టికి తీసుకెళ్లారు.
చిన్న విషయాలను పట్టించుకోకండి:
మంత్రి కొండా సురేఖ వాదనలను విన్న మీనాక్షి నటరాజన్.. ఆమెకు పలు సూచనలు చేసినట్లు తెలుస్తోంది. చిన్న చిన్న విషయాలను పట్టించుకోవాల్సిన అవసరం లేదని, రాష్ట్రంలో పార్టీకి, ప్రభుత్వానికి మంచి పేరు వచ్చేలా పని చేయాలని సూచించినట్లు సమాచారం. మీరు ఒక బీసీ లీడర్‌గా పార్టీలో పెద్ద బాధ్యతను కలిగి ఉన్నారని కాబట్టి, వివాదాలకు తావివ్వకుండా, పార్టీని బలోపేతం చేసే దిశగా దృష్టి పెట్టాలని మీనాక్షి స్పష్టం చేసినట్లు తెలిసింది. చాలా కాలంగా ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు కొనసాగుతుండగా తాజాగా దేవాయాద శాఖపై సమీక్షతో మరోసారి మాటల యుద్ధం అధిష్టానం జోక్యంతోనైనా ఈ 'కౌంటర్-ఎన్‌కౌంటర్' రాజకీయాలకు తెరపడుతుందో లేదో చూడాలి.






