- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు

దిశ, డైనమిక్ బ్యూరో: వియత్నాం బోటు ప్రమాదంలో మృతి చెందిన ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ముగ్గురు పర్యాటకుల మృతదేహాలు మంగళవారం హైదరాబాద్‌కు చేరుకుని, అక్కడి నుంచి ప్రత్యేక అంబులెన్స్‌లలో వారి స్వస్థలాలకు తరలించారు. వియత్నాంలో ఈ నెల 11న జరిగిన బోటు ప్రమాదంలో మృతి చెందిన మచిలీపట్నానికి చెందిన జయశ్రీ, కడపకు చెందిన ముడియం శ్రీధర్, హిందూపురానికి చెందిన రవితేజ మృతదేహాలు మంగళవారం ఉదయం హైదరాబాద్‌కు చేరుకున్నాయి. ఏపీఎన్‌ఆర్‌టీఐ ఆధ్వర్యంలో ప్రత్యేక అంబులెన్స్‌ల ద్వారా మృతదేహాలను స్వస్థలాలకు తరలించారు. ఈ సందర్భంగా శంషాబాద్ విమానాశ్రయంలో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించి, మృతదేహాలను అప్పగించారు. వియత్నాం, భారత రాయబార కార్యాలయాలతో సీఎం చంద్రబాబు, మంత్రి లోకేశ్ సమన్వయం చేయడంతో మృతదేహాల తరలింపు ప్రక్రియ వేగవంతమైంది. ఇప్పటికే రవితేజ మృతదేహం హిందూపురానికి, శ్రీధర్ మృతదేహం కడపకు చేరుకుంది. దీంతో ఆయా గ్రామాల్లో తీవ్ర విషాదఛాయలు అలముకున్నాయి.






