నిబంధనల ప్రకారమే హుడా లేఔట్ ప్లాట్లు కొనుగోలు చేశా

by Ratna Kumari |

ప్రభుత్వ అనుమతి పొందిన హుడా లేఔట్‌లో నిబంధనల ప్రకారమే ప్లాట్లు కొనుగోలు చేశానని, తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని చర్లపల్లికి చెందిన పల్లె రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

నిబంధనల ప్రకారమే హుడా లేఔట్ ప్లాట్లు కొనుగోలు చేశా
X

కాప్రా, జూలై 14 (ఆంధ్రప్రభ) : ప్రభుత్వ అనుమతి పొందిన హుడా లేఔట్‌లో నిబంధనల ప్రకారమే ప్లాట్లు కొనుగోలు చేశానని, తాను ఎలాంటి భూకబ్జాలకు పాల్పడలేదని చర్లపల్లికి చెందిన పల్లె రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు. మంగళవారం చర్లపల్లిలో విలేకరులతో మాట్లాడుతూ.. 1986లో చర్లపల్లి డివిజన్ ఆఫీసర్స్ కాలనీలోని సర్వే నంబర్లు 216, 222ల్లో హుడా లేఔట్ ఏర్పాటు చేశారని తెలిపారు. ఆ లేఔట్‌లోని ప్లాట్ నంబర్లు 127, 128లను తాను చట్టబద్ధంగా కొనుగోలు చేశానని చెప్పారు. తన ప్లాటులో ఇటీవల స్థలాన్ని చదును చేయించినట్లు పేర్కొన్న ఆయన, దీనిని భూకబ్జాగా చిత్రీకరించడం సరికాదన్నారు. తన ప్లాటుకు ఆనుకుని చర్లపల్లి పారిశ్రామికవాడకు చెందిన భూమి ఉండటంతో హద్దుల విషయంలో స్పష్టత అవసరమని తెలిపారు.

ఈ నేపథ్యంలో సంబంధిత రెవెన్యూ అధికారులు సర్వే నిర్వహించి పారిశ్రామికవాడ హద్దులను ఖరారు చేయాలని తాను గతంలోనే విన్నవించినట్లు చెప్పారు. దీంతో తన ప్లాటు హద్దులు కూడా స్పష్టమవుతాయని పేర్కొన్నారు. అధికారుల సమక్షంలో ఇరుపక్షాల సమక్షంలో సర్వే నిర్వహించేందుకు తాను సిద్ధంగా ఉన్నానని, అధికారులు స్పందించి సర్వే చేపట్టాలని కోరారు. పారిశ్రామికవాడకు చెందిన స్థలాన్ని లేదా ఇండస్ట్రియల్ ప్లాట్లను కబ్జా చేశానన్న ఆరోపణలు పూర్తిగా అవాస్తవమని పల్లె రాంభూపాల్ రెడ్డి స్పష్టం చేశారు.

Next Story