- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
డైట్ లో స్పాట్ అడ్మిషన్లు
ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ డైట్ వికారాబాద్ కళాశాలలో ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో భర్తీ కాకుండా మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ల ద్వారా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ భర్తీ చేయనున్నట్లు వికారాబాద్ డైట్ ప్రిన్సిపాల్ అబ్దుల్ ఘని తెలిపారు.

దిశ, వికారాబాద్ ప్రతినిధి: ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ప్రభుత్వ డైట్ వికారాబాద్ కళాశాలలో ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో భర్తీ కాకుండా మిగిలిన సీట్లను స్పాట్ అడ్మిషన్ ల ద్వారా ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ భర్తీ చేయనున్నట్లు వికారాబాద్ డైట్ ప్రిన్సిపాల్ అబ్దుల్ ఘని తెలిపారు. డీసెట్-2026 లో క్వాలిఫై అయిన అభ్యర్థులు డీఎల్ఈడీ కోర్సులలో నిబంధనల ప్రకారం అడ్మిషన్లు పొందవచ్చునని తెలిపారు. ఈనెల 16-07-2026 మరియు 17-07-2026 మధ్యాహ్నం సమయం 2 గంటల వరకు వికారాబాద్ ప్రభుత్వ డైట్ కళాశాలలో నిర్వహిస్తారు. అలాగే ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో భర్తీ చేయుటకు 18-07-2026 నుంచి 21-07-2026 మధ్యాహ్నం 2 గంటల వరకు సమయం వరకు ప్రైవేట్ డీఈడీ కళాశాలల్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహిస్తామన్నారు. ఖాళీల వివరాలు డీసెట్ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నట్లు తెలిపారు. వివరాల కొరకు సంప్రదించవలసిన నెంబర్ 7780740880. ఈ అవకాశాన్ని డైట్ చేసే అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు






