IND VS ENG : ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన బుమ్రా

by Harish |

భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించాడు.

IND VS ENG : ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించిన బుమ్రా
X

దిశ, స్పోర్ట్స్ : భారత స్టార్ బౌలర్ జస్ప్రిత్ బుమ్రా ఇంగ్లాండ్ గడ్డపై చరిత్ర సృష్టించాడు. ఇంగ్లాండ్‌లో వన్డేల్లో అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా నిలిచాడు. ఇంగ్లాండ్‌తో జరుగుతున్న తొలి వన్డేలో హ్యారీ బ్రూక్‌ నుఅవుట్ చేయడంతో అతను ఈ ఫీట్ సాధించాడు. 14వ ఓవర్‌ వేసిన బుమ్రా తొలి బంతికే బుమ్రాను పెవిలియన్ పంపాడు. అతని ఇచ్చిన క్యాచ్‌ను స్లిప్‌లో ఉన్న రోహిత్ అందుకున్నాడు. ఇంగ్లాండ్ గడ్డపై బుమ్రాకు ఇది 31వ వన్డే వికెట్. ఇంగ్లాండ్‌లో అత్యధిక వన్డే వికెట్లు తీసిన జాబితాలో బుమ్రా అగ్రస్థానంలో ఉండగా.. బుమ్రా 30 వికెట్లతో రెండో స్థానంలో ఉన్నాడు. ఆ తర్వాత భువనేశ్వర్(28), మదన్ లాల్(27), మహ్మద్ షమీ(26) ఉన్నారు.

మరోవైపు, హ్యారీ బ్రూక్ వికెట్ వన్డేల్లో బుమ్రాకు 150వ వికెట్ కావడం విశేషం. అతను 4,605 బంతుల్లో ఈ మైలురాయిని చేరుకున్నాడు. భారత్ తరపున అతి తక్కువ బంతుల్లో ఈ ఘనత సాధించిన మూడో బౌలర్. అతని కంటే ముందు మహ్మద్ షమీ(4,070), కుల్దీప్ యాదవ్(4513) ఉన్నారు.


Next Story