మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నేరంగా భావించాలి

by Kodari Anjali |

మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నేరంగా భావించాలని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్ భూపాల్ అన్నారు.

మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నేరంగా భావించాలి
X

దిశ, ఏన్కూర్: మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నేరంగా భావించాలని ప్రజ్వల స్వచ్ఛంద సంస్థ రిసోర్స్ పర్సన్ భూపాల్ అన్నారు. మంగళవారం మండల మహిళా సమాఖ్య ఏన్కూర్, ప్రజ్వల స్వచ్చంద సంస్థ హైదరాబాద్ ఆధ్వర్యంలో మానవ అక్రమ రవాణాపై 1 రోజు శిక్షణను స్థానిక మండల సమాఖ్య మీటింగ్ హాల్ నందు నిర్వహించడం జరిగింది. శిక్షణకు ముఖ్య అతిథిగా హాజరైన భూపాల్, ఏపీ ఎం శ్యాం కుమార్, హాజరై మాట్లాడుతూ... మానవ అక్రమ రవాణా, ఆడపిల్లల మోసాలపై అవగాహనా ప్రతి ఒక్కరికీ అవసరం ఉంది. అన్నారు. జిల్లా స్థాయి నుండి ఈ శిక్షణను ఇచ్చారు. ప్రతి ఒక్క గ్రామ దీపిక ఈ అక్రమ రవాణాపై అవగహన పొంది, గ్రూప్ మీటింగ్‌లలో గ్రామ సభల్లో అందరికీ వివరించాలని అన్నారు. ముక్యంగా మహిళలు, బాలికలలు దీనిపై అవగాహన కలిగి ఉండాలి అని అన్నారు.

హెల్ప్ లైన్ నంబర్స్‌ను సంప్రదించాలి..

ప్రజ్వల సంస్థ రిసోర్స్ పర్సన్ భూపాల్ మాట్లాడుతూ... మానవ అక్రమ రవాణా అనేది ప్రపంచంలోనే మూడవ అతిపెద్ద నేరంగా ఉందని, ప్రతి రోజు ఎంతోమంది అమ్మాయిలు మహిళలు మోసపోతున్నారు. దీనిపై గ్రామ స్థాయిలో ప్రజలతో మంచి సంబంధాలను కలిగి ఉన్న గ్రామ సహాయకులు అవగాహనా కల్పించాలి అని అన్నారు. ముక్యంగా ఏదైనా సమస్య ఎదురైనపుడు 100 పోలీస్, 1930 సైబర్ ట్రాఫికింగ్, 181 మహిళా హెల్ప్ లైన్ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నంబర్స్‌ను సంప్రదించాలని అన్నారు. అక్రమ రవాణాకి సంబంధించిన విషయాలను లఘు చిత్రాలు పవర్ పాయింట్ ప్రెసెంటేషన్ ద్వారా వివరించారు. మహిళా సంగం సభ్యులతో ఒక జాగృతి సంఘాన్ని ఏర్పాటు చేయడం ఏవైనా సమస్యలు ఉంటే పరిష్కరించే విధంగా ఉంటారు. ఈ శిక్షణలో ప్రజ్వల అసిస్టెంట్ కోఆర్డినేటర్లు భూపాల్, హరీష్, మండల మహిళా సమాఖ్య కమ్యూనిటీ కోఆర్డినేటర్స్, మండలం నుండి గ్రామ సహాయకులు పాల్గొన్నారు.

Next Story