- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
సార్.. మిమ్మల్ని హగ్ చేసుకోవచ్చా?.. సీఎం విజయ్ రియాక్షన్‍కు నెటిజన్ల ఫిదా
తమిళనాడు సీఎం విజయ్ మరోసారి తన సింప్లిసిటీ నిరూపించుకున్నారు. ఓ అభ్యర్థి చేసిన రిక్వెస్ట్ ను చిరునవ్వుతో అంగీకరించి అందరి మనసులు గెలుచుకున్నారు.

దిశ, డైనమిక్ బ్యూరో: ఇవాళ, రేపు గల్లీ స్థాయి లీడర్లే హంగు ఆర్భాటాలతో హల్ చల్ చేస్తున్నారు. ఇక కొంత మంది ఎమ్మెల్యేలు, ఎంపీలైతే తమ దగ్గరకు రావాలన్నా తమతో మాట్లాడాలన్నా ఎదుటి వారికి ఓ రేంజ్ ఉండాల్సిందే అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. కానీ ఈ ఆర్భాటాలకు చెక్ పెడుతూ నిరాడంబరత, మానవీణ కోణంలో తమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ సింపుల్ సిటీ రోజురోజుకు ప్రజల్లో ఆయన పట్ల మరింత అభిమానం పెరిగేలా చేస్తోంది. ఇవాళ చెన్నైలో జరిగిన ఓ కర్యక్రమంలో జరిగిన సంఘటన సోషల్ మీడియాలో వైరల్‍గా మారింది. తమిళనాడు వైద్యారోగ్యశాఖలో కొత్తగా ఎంపికైన అభ్యర్థులకు ఇవాళ జరిగిన కార్యక్రమంలో సీఎం విజయ్ నియామక పత్రాలు అందచేశారు. ఈ సందర్భంగా ఓ అభ్యర్థి తన నియామక పత్రం అందుకుంటూ 'సార్.. మిమ్మల్ని ఒకసారి హక్ చేసుకోవచ్చా? అని రిక్వెస్ట్ చేశాడు. దీంతో స్పందించిన సీఎం చిరునవ్వుతో అంగీకరించారు. వెంటనే అతడిని ఆప్యాయంగా హత్తుకున్నాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోను చూసిన నెటిజన్లు స్పందిస్తు సీఎం సింపుల్ సిటీని ప్రశంసిస్తున్నారు.






