- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
Home > ఏపీ > శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా > నెల్లూరులో విషాదం తప్పింది.. ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి, పిల్లలను కాపాడిన పోలీసులు
నెల్లూరులో విషాదం తప్పింది.. ఆత్మహత్యాయత్నం చేసిన తల్లి, పిల్లలను కాపాడిన పోలీసులు
by Ramesh Naini |
నెల్లూరు జిల్లాలోని రాపూరు అరుంధతివాడలో పోలీసుల అప్రమత్తతతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు.

X
దిశ, డైనమిక్ బ్యూరో: నెల్లూరు జిల్లాలోని రాపూరు అరుంధతివాడలో పోలీసుల అప్రమత్తతతో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ప్రాణాపాయం నుంచి బయటపడ్డారు. కుటుంబ కలహాలతో తీవ్ర మనస్తాపానికి గురైన ఓ తల్లి, తన ఇద్దరు పిల్లలతో కలిసి ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్యాయత్నం చేసింది. గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. స్పందించిన ‘112’ స్పందన బృందం తక్షణమే ఘటనాస్థలానికి చేరుకుంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన పోలీసులు, ఇంటి కిటికీ రేకులను తొలగించి లోపలికి ప్రవేశించారు. ఉరేసుకుంటున్న ఆ ముగ్గురిని సకాలంలో రక్షించి, ప్రాణాపాయం తప్పించారు. పోలీసుల తక్షణ స్పందనపై స్థానికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
Next Story






