బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద ఆట స్థలాన్ని పరిశీలించిన ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే

by Kodari Anjali |

యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన ఆట స్థలాన్ని సోమవారం పరిశీలించారు.

బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద ఆట స్థలాన్ని పరిశీలించిన ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే
X

దిశ, హస్తినాపురం: యువతకు మెరుగైన క్రీడా సౌకర్యాలు అందించాలనే లక్ష్యంతో ఎల్‌బీనగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి బైరామల్‌గూడ ఫ్లైఓవర్ కింద ఏర్పాటు చేసిన ఆట స్థలాన్ని సోమవారం పరిశీలించారు. క్రీడా మైదానంలోని వసతులు, నిర్వహణ, అభివృద్ధి పనులను క్షుణ్ణంగా పరిశీలించిన ఆయన సంబంధిత అధికారులకు పలు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఈ సందర్భంగా యువత రాత్రి వేళల్లో కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా సురక్షితంగా క్రీడల్లో పాల్గొనేందుకు గతంలోనే ఏర్పాటు చేసిన హైమాస్ట్, ఎల్‌ఈడీ లైటింగ్‌కు వెంటనే విద్యుత్ కనెక్షన్ ఇవ్వాలని సంబంధిత అధికారులను ఫోన్‌లో ఆదేశించారు.

నాణ్యమైన క్రీడా మౌలిక వసతుల కల్పనకు..

లైటింగ్ అందుబాటులోకి వస్తే ఆట స్థలం పూర్తి స్థాయిలో వినియోగంలోకి వచ్చి యువతకు మరింత ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు. పరిశీలనలో భాగంగా కొన్ని క్రీడా పరికరాలు దెబ్బతిన్నట్లు గుర్తించిన ఎమ్మెల్యే, వాటిని తక్షణమే మరమ్మతు చేసి వినియోగానికి సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అలాగే ఆట స్థలంలో అవసరమైన ఇతర సౌకర్యాలను కూడా దశలవారీగా అభివృద్ధి చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దేవిరెడ్డి సుధీర్ రెడ్డి మాట్లాడుతూ, యువత శారీరకంగా, మానసికంగా దృఢంగా ఎదగాలంటే క్రీడలను ప్రోత్సహించడం అత్యంత అవసరమన్నారు. అందుకే నియోజకవర్గంలో నాణ్యమైన క్రీడా మౌలిక వసతుల కల్పనకు ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని చెప్పారు. యువత రాత్రి సమయంలో కూడా భద్రంగా ఆటలు ఆడుకునేలా అత్యాధునిక లైటింగ్‌తో పాటు అవసరమైన అన్ని సౌకర్యాలను కల్పిస్తామని హామీ ఇచ్చారు.

Next Story