- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
చెరువు కట్టపై నుంచి అదుపుతప్పిన ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ మృతి
మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటియపాలెం గ్రామ శివారులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది.

దిశ, తొర్రూరు :- మహబూబాబాద్ జిల్లా తొర్రూరు మండలంలోని చీకటియపాలెం గ్రామ శివారులో మంగళవారం విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువు కట్టపై వెళ్తున్న ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడటంతో డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం, చర్లపాలెం గ్రామం నుంచి మొరం లోడ్ చేసి చీకటాయపాలెం గ్రామ పరిధిలోని పెద్ద చెరువు సమీపంలో నిర్మాణంలో ఉన్న కవిత హాస్పిటల్ నిర్వాహకుల ఫామ్‌హౌస్‌కు తరలించారు. అక్కడ మొరంను అన్‌లోడ్ చేసిన అనంతరం తిరిగి మట్టి తీసుకురావడానికి వెళ్తుండగా చెరువు కట్టపై ట్రాక్టర్ అదుపుతప్పి పక్కనే ఉన్న పొలంలోకి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ట్రాక్టర్ డ్రైవర్/ఓనర్ అయిన తండా మురళి (32) తీవ్రంగా గాయపడి ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. సమాచారం అందుకున్న స్థానికులు, పోలీసులు వెంటనే అక్కడికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మృతుడు మురళికి భార్యతో పాటు ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. కుటుంబ పోషకుడిని కోల్పోవడంతో వారి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. గ్రామస్థులు మురళి మృతి పట్ల ప్రగాఢ సంతాపం వ్యక్తం చేశారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.






