- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
స్టాండప్ కమెడియన్ సమయ్ రానాకు షాక్.. రూ.10 లక్షల జరిమానా వేసిన సుప్రీంకోర్టు
న్యాయస్థానం ముందు తప్పుడు వాంగ్మూలాలు ఇచ్చినందుకు గాను ప్రముఖ స్టాండప్ కమెడియన్‌కు సుప్రీంకోర్టు ఊహించని షాకిచ్చింది.

దిశ, వెబ్‌డెస్క్: ఫేమస్ స్టాండప్ కమిడియన్, యూట్యూబర్ సమయ్ రైనా (Samay Raina)కు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు (Supreme Court) ఝలక్ ఇచ్చింది. కోర్టు ఎదుట తప్పుడు స్టేట్‌మెంట్ ఇచ్చినందుకు గానూ ధర్మాసనం ఆయనపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా, రూ.10 లక్షల భారీ జరిమానా విధిస్తూ సంచలన తీర్పును వెలువరించింది. విచారణ సందర్భంగా రెస్పాండ్ అవుతూ.. సమయ్ రైనా కోర్టును చాలా తేలికగా తీసుకున్నాడని, తమ ఆదేశాలను బేఖాతరు చేస్తూ తప్పుడు ప్రకటనలు ఇచ్చాడని ధర్మాసనం తీవ్రంగా మండిపడింది. ఈ నేపథ్యంలోనే రూ.10 లక్షల జరిమానా విధిస్తూ గట్టి హెచ్చరికలు జారీ చేసింది. సోషల్ మీడియా ఇన్‌ఫ్లుయెన్సర్లు వాక్ స్వాతంత్య్రాన్ని కేవలం డబ్బు సంపాదన కోసమే వాడుకుంటూ, సమాజంలో వివిధ వర్గాల మనోభావాలను గాయపరిచేలా ప్రవర్తిస్తే కఠిన పరిణామాలు ఉంటాయని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
కాగా, దివ్యాంగులు, తీవ్రమైన ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్న చిన్నారులను ఉద్దేశించి సమయ్ రైనా తన ఆన్‌లైన్ షో (Online Shows)లలో చేసిన వివాదాస్పద వ్యాఖ్యలపై గతంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన న్యాయస్థానం, గతంలోనే సమయ్ రైనా, ఇతర కమిడియన్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ బహిరంగ క్షమాపణలు చెప్పాలని, అదేవిధంగా దివ్యాంగుల సహాయార్థం ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసిన విషయం తెలిసిందే.






