ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్ జానకి

by Jakkula.Mamatha |

రాజంపేట్ మండల పరిధిలోని అన్నారం తండాలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను తహసీల్దార్ జానకి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు.

ఎస్ఐఆర్ ప్రక్రియను పరిశీలించిన తహసీల్దార్ జానకి
X

దిశ,రాజంపేట్: రాజంపేట్ మండల పరిధిలోని అన్నారం తండాలో జరుగుతున్న స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(ఎస్‌ఐఆర్) ప్రక్రియను తహసీల్దార్ జానకి మంగళవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా బీఎల్‌వోలు ఇంటింటికి వెళ్లి ఓటర్ల వివరాలను సక్రమంగా నమోదు చేస్తున్న తీరును, ఎన్యూమరేషన్ ఫారాలను, ఆమె తనిఖీ చేశారు. ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియను ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు పారదర్శకంగా, వేగవంతంగా పూర్తి చేయాలని బీఎల్‌వోలకు సూచించారు.

ప్రతి ఇంటిని తప్పకుండా సందర్శించి అర్హులైన ప్రతి ఓటరు వివరాలను నమోదు చేయాలని, అనర్హుల వివరాలను నిబంధనల ప్రకారం గుర్తించాలని తెలిపారు.ఓటర్ల నుంచి వచ్చే దరఖాస్తులు, అభ్యంతరాలను నిబంధనలకు అనుగుణంగా పరిశీలించి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. అనంతరం అంగన్వాడి కేంద్రాన్ని తనిఖీ చేశారు.కేంద్ర నిర్వహణ, పిల్లల హాజరు పట్టికను పోషకాహార పంపిణీ ని పరిశీలించారు. పరిసరాల పరిశుభ్రతను మౌలిక సదుపాయాలను సమీక్షించారు. సంబంధిత అంగన్వాడి టీచర్ కు అవసరమైన సూచనలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో బీఎల్‌వోలు, అంగన్వాడి సిబ్బంది పాల్గొన్నారు.

Next Story