- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
మీ టాస్కులు.. ప్లాన్లు అన్నీ తనే మేనేజ్ చేస్తుంది.. జస్ట్ ఇలా చేయండి చాలు!
స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ దానిని డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. మీ టాస్కులు, ప్రణాళికలు, రిమైండర్లు అదే మేనేజ్ చేసేస్తుంది.

దిశ, ఫీచర్స్ : ఎప్పుడేం చేయాలనే విషయాలను చాలామంది డైరీలోనో, నోట్ బుక్‌లోనో రాసుకుంటుంటారు. ఇక కొందరు ప్రొఫెషనల్స్ లేదా ఉన్నతస్థాయి ఉద్యోగులు, సెలబ్రిటీలు, ప్రముఖులు అయితే రోజువారీ షెడ్యూల్ నిర్వహణకోసం పర్సనల్ అసిస్టెంట్లను, మేనేజర్లను నియమించుకుంటుంటారు. కానీ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ ఇప్పుడు అలాంటి అవసరాలను సైతం తగ్గిస్తోందని మీకు తెలుసా? వ్యక్తిగత ఉద్యోగులు, పర్సనల్ అసిస్టెంట్లు నిర్వహించే పనులను సైతం ఏఐ నిర్వహిస్తోంది. అలాంటి ఒక అద్భుతమైన ఏఐ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంటే సారా ఏఐ (SarahAI). ఇంతకీ దీనిని ఎలా పొందాలి? ఏ విధంగా పనిచేస్తుందో ఇప్పుడు చూద్దాం.
టాస్కుల క్రియేషన్..
సారా ఏఐ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్(Sarah AI Executive Assistant)ను స్మార్ట్‌ఫోన్ ఉన్న ప్రతి ఒక్కరూ ఉపయోగించుకోవచ్చు. దీనిని గూగుల్ ప్లే స్టోర్, యాపిల్ యాప్ స్టోర్‌ల నుంచి సులభంగా డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ చేసిన తర్వాత దీనిని వాట్సాప్ ద్వారా కూడా యూజ్ చేయవచ్చునని నిపుణులు చెబుతున్నారు. ఇక దీనివల్ల ఉపయోగాలేమిటంటే.. వ్యక్తిగత పనులు, ప్రణాళికల నిర్వహణకు ప్రత్యేకంగా మానవ అసిస్టెంట్లను పెట్టుకోకపోయినా నడుస్తుంది. పైగా ఖర్చు తగ్గుతుంది. అంతేకాకుండా సారా AIతో మీరు వాట్సాప్‌లోనే టాస్కులు క్రియేట్ చేయడం, రీషెడ్యూల్ చేయవచ్చు, టీమ్ మెంబర్లకు అసైన్ చేయడం, ఫాలో-అప్‌లను ట్రాక్ చేయడం అన్నీ ఈజీగా చేయవచ్చు. అలాగే మీటింగ్‌ల తర్వాత ఆటోమేటిక్ చెక్-ఇన్‌లు, రిమైండర్లను కూడా ఇది పంపుతుందని, వాయిస్ & టెక్స్ట్ రెండింటినీ ఇంటర్నల్‌గా అర్థం చేసుకుని పని చేస్తుందని నిపుణులు చెబుతున్నారు.
వ్యాపార, వృత్తి నిపుణులకు అనుకూలం..
ముఖ్యంగా వ్యాపార నిర్వహకులు, ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఈ సారా ఏఐ అసిస్టెంట్ రోజువారీ టాస్కులను, ప్రణాళికలను పూర్తి చేయడంలో అద్భుతంగా సహాయపడుతుంది. అయితే ఇది పూర్తి ఉచితం కాదు. మొదటి 14 రోజులు ఫ్రీ ట్రయల్ తర్వాత నెల నెలా చెల్లింపులు (సుమారు ₹850) చేయడం ద్వారా పనిచేస్తుందని నిపుణులు చెబుతున్నారు. మొత్తానికి ఏఐ సాంకేతికత మానవ రోజువారీ జీవితాల్లోని సమస్యలను, టాస్కులను పూర్తి చేయడంలో ఎలా సహాయపడుతుందో తెలియజేయడానికి చక్కటి ఉదాహరణే ఈ సారా ఏఐ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్.






