- టీజీ
- ఏపీ
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్
- బిజినెస్
- స్పోర్ట్స్
- దేశం-విదేశం
- జిల్లా వార్తలు
- దిశ స్పెషల్స్
- కెరీర్
- ఎడిట్ పేజీ
- క్రైమ్
- రాశి ఫలాలు
VIRAL: సాక్షాత్తూ పరమశివుడి లీలే..! ఫ్రీజర్‌లో ‘అమర్‌నాథ్’ శివలింగం ప్రత్యక్షం
ఆగ్రాలోని ఓ ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్‌లో ఏర్పడిన ‘మంచు శివలింగం’ ఆకారం కలకలం రేపింది.

దిశ, వెబ్‌డెస్క్: ‘ఇందుగలడందులేడని సందేహము వలదు చక్రి సర్వోపగతుండు.. ఎందెందు వెదకి చూచిన అందందే గలడు దానవాగ్రణి వింటే’ అని నాడు హిరణ్యకష్యపుడితో ప్రహ్లాదుడు అన్ని మాటలు మనం సినిమాల్లో చూసే ఉంటాం. అయితే, అచ్చం అలాంటి ప్రస్తుతం అగ్రా (Agra)లో చోటుచేసుకుంది. అచ్చం అమరనాథ్ (Amarnath)లో కొలువై ఉన్న మంచు శివలింగం లాంటి తరహా లింగం ఓ ఇంట్లో డీప్ ఫ్రిడ్జ్ (Deep freezer)లో వెలిసింది. అవును, ప్రస్తుతం ఆ వింత మంచు ఆకారం ఇప్పుడు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. ఆ శివలింగాన్ని చూసేందుకు స్థానిక భక్తులు పెద్ద ఎత్తున తరలివస్తున్నారు.
పూజలు, మంగళహారతులు..
ఆగ్రాకు చెందిన ఓ కుటుంబం తమ ఇంట్లోని డీప్ ఫ్రిడ్జ్ డోర్ తీసి చూడగా అచ్చం అమర్‌నాథ్ మంచు శివలింగాన్ని పోలిన ఆకారం దర్శనమిచ్చింది. దీంతో ఆశ్చర్యపోయిన కుటుంబ సభ్యులు దానిని సాక్షాత్తూ ఆ పరమశివుడి లీలగా భావించారు. వెంటనే ఆ మంచు శివలింగానికి ప్రత్యేక పూజలు, హారతులు ఇవ్వడం ప్రారంభించారు. ఈ విషయం కాస్తా చుట్టుపక్కల దావానంలో వ్యాపించడంతో ఆ ఇంటికి స్థానికులు ఆ ఇంటికి పోటెత్తారు. ఫ్రీజర్‌లోని శివలింగ రూపాన్ని దర్శించుకుని, భక్తిశ్రద్ధలతో కొలుస్తూ పెద్ద ఎత్తున కానుకలు, చందాలు సమర్పిస్తున్నారు. ప్రస్తుతం ఆ ఇల్లంతా భక్తి నినాదాలతో మార్మోగిపోతోంది.






